అక్కినేని అఖిల్ సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చి ఇప్పటిదాకా ఒక్క హిట్ కూడా కొట్ట లేకపోయాడు. అక్కినేని కుటుంబం నుండి ఎంట్రీ అవటంతో ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలకు అఖిల్ నుండి సరైన సినిమా ఇప్పటివరకు రాలేదు. ఇప్పటిదాకా చేసిన ప్రతి సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతూనే ఉంది. అందం ఫైట్స్ మరియు డాన్స్ టాలెంట్ పుష్కలంగా ఉన్న గాని ఇప్పటిదాకా అఖిల్ కి విజయం వరించలేదు. ఇటువంటి తరుణంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మాణ సారధ్యం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'బ్యాచిలర్' అనే సినిమా ప్రస్తుతం చేస్తున్నాడు.

IHG

ఫ్లాప్ డైరెక్టర్ చేతిలో అఖిల్ సినిమా ఉండటంతో ప్రస్తుతం అక్కినేని అభిమానులు ఈ సినిమాపై టెన్షన్ పడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవడంతో త్వరలో ఈ సినిమాకి మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉండటంతో తాజాగా నాగార్జున ఈ ప్రాజెక్టు లోకి ఎంటర్ కాబోతున్నట్లు సమాచారం.

IHG's next ...

దాదాపు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ 80% ఇప్పటికే పూర్తి కావడంతో రషెస్ చూసిన నాగార్జునకి సినిమా లో కొద్దిగా నేగిటివిటీ కనబడటంతో ప్యాచ్ వర్క్ చేయాలని డైరెక్టర్ భాస్కర్ కి సూచించినట్లు టాక్. అంతేకాకుండా ఆ సీన్లకు సంబంధించి షూటింగ్ విషయంలో నాగార్జున రంగంలోకి దిగుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఆ సన్నివేశాలకు సంబంధించిన నిర్మాత తో కూడా నాగార్జున డిస్కషన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో అఖిల్ పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: