మెగాస్టార్ చిరంజీవికి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిన విషయమే. ఆయన సినిమాల్లో నటిస్తే ప్రత్యేకమైన గుర్తింపు వస్తుందని ఎందరో నటీనటులు అనుకునేవారు. ఆయనకున్న ఇమేజ్, ఫ్యాన్ బేస్ అలాంటిది. ఓ సన్నివేశం కావొచ్చు, అతిధిపాత్ర కావొచ్చు, స్పెషల్ సొంగ్ కావొచ్చు. ఇలాంటి అవకాశం ఎవరికి వచ్చినా వదులుకోరు. అటువంటి అరుదైన అవకాశం హీరోయిన్ సిమ్రాన్ కు వచ్చింది. అప్పటికి సిమ్రాన్ తెలుగు సినిమాల్లో తన హవా సాగిస్తోంది. ఆ సమయంలో చిరంజీవితో వచ్చిన అవకాశాన్ని ఆమె వదులుకోలేదు. అది కూడా ఓ స్పెషల్ సాంగ్ కోసం.

IHG

 

ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 2001లో వచ్చిన ‘అన్నయ్య’లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది సిమ్రాన్. అప్పటికే తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణిస్తోంది సిమ్రాన్. ఆ సినిమాలో ‘ఆట కావాల.. పాట కావాలా..’ అనే ఊర మాస్ పాట చేసింది. ఆ పాట అప్పట్లో సూపర్ హిట్ అయింది. చిరంజీవితో కలిసి సిమ్రాన్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. చిరంజీవి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది ఆ పాట. ఆ పాటతో చిరంజీవి పక్కన సిమ్రాన్ తొలిసారి తెరపై కనిపించడమే అందరికీ కనువిందైంది. సినిమా సూపర్ హిట్ కావడంలో ఈ పాట ప్లస్ అయింది.

IHG

 

నిజానికి అప్పటికి సిమ్రాన్ ఉన్న పొజిషన్ లో స్పెషల్ సాంగ్ చేయడం కష్టం. అప్పటికే బాలకృష్ణతో ‘సమరసింహారెడ్డి’, నాగార్జునతో ‘నువ్వు వస్తావని’తో సిల్వర్ జూబ్లీ హిట్స్ ఇచ్చింది. అన్నయ్యతో పాటే వెంకటేశ్ తో చేసిన ‘కలిసుందాం..రా’ కూడా సిల్వర్ జూబ్లీ సినిమానే. చిరంజీవితో ఇంకా అప్పటికి ఏ సినిమా చేయలేదు సిమ్రాన్. దీంతో అన్నయ్యలో సిమ్రాన్ స్పెషల్ సాంగ్ చేయడం స్పెషల్ గా నిలిచింది. ఆ తర్వాత సిమ్రాన్ మరే సినిమాలో స్పెషల్ సాంగ్ చేయలేదు.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANNAYYA' target='_blank' title='annayya-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>annayya</a> Completes 15years - Forum

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: