బాలయ్య ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి మీద ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. సినీ పెద్దల మీటింగుకు తనను పిలవకపోవడంపైన అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. ఆ ఫ్లోలో బాలయ్య కొన్ని వివాదాస్పద కామెంట్స్ కూడా చేశాదు. అయితే ఆ తరువాత సినీ పెద్దల జోక్యంతో ఆ వివాదం సద్దుమణిగింది. ఇద్దరు హీరోలూ ఒక్కటేనని అంతా సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే ఈ నెల 10న బాలక్రిష్ణ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. ఈసారి వేడుకలకు ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే బాలయ్య సష్టి పూర్తి వేడుకలు. బాలయ్య ఈ వేడుకలను గొప్పగా జరుపుకోవాలనుకుంటున్నారుట. ఈ వేడుకలకు సన్నిహితులను, సినీ రాజకీయ ప్రముఖులను కూడా పిలవాలని బాలయ్య ఇప్పటికే డిసైడ్ అయ్యారుట.

 

మరి ఈ వేడుకలకు చిరంజీవికి ఆహ్వానం అందుతుందా అన్నది ఒక ఇంటెరెస్టింగ్ పాయింట్. చిరంజీవి షష్టి పూర్తి వేడుకలు కూడా నాలుగేళ్ల క్రితం బాగానే నిర్వహించారు. నాడు సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఇపుడు అదే విధంగా బాలక్రిష్ణ కూడా జరుపుకునే అవకాశాలు ఉన్నాయి.

 

ఇప్పటికే దానికి సమంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపధ్యంలో సినీ పరిశ్రమ నుంచి బాలయ్య చాలా మందిని పిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వేడుకలకు చిరంజీవిని పిలిస్తారా లేదా అన్నది కూడా చర్చగా ఉంది. చిరంజీవిని కనుక పిలిస్తే మాత్రం ఆయన హాజరు అయితే ఈ ఇద్దరు హీరోల మధ్య మళ్ళీ వివాదాలు అన్నీ ఫుల్ స్టాప్ పడతాయని అంటున్నారు.

 

మొత్తం మీద చూసుకుంటే బాలయ్య ఇంటి వేడుకకు చిరంజీవి వస్తే మాత్రం టాలీవుడ్లో కూల్ వాతావరణం ఏర్పడుతుంది అంటున్నారు. చూడాలి మరి అదేలా జరుగుతుందో. ఏది ఏమైనా ఈ ఇద్దరు హీరోల మనసుల్లో ఏమీ ఉండదు కాబట్టి మళ్ళీ ఇదివరకులా స్నేహంగా ఉంటారన్నది నిజమని అంతా అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: