శోభన్ డైరక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా వర్షం. 2004లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ ను హీరోగా నిలబెట్టడంలో ఉపయోగపడ్డది. సినిమాలో చిన్న భామ త్రిష హీరోయిన్ గా నటించింది. ప్రభాస్, త్రిష జోడీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి పౌర్ణమి సినిమా చేశారు. ప్రభుదేవా డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. 

 

వర్షం సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఆ సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్.. అయితే హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్.. ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా.. చుట్టంలా వస్తావు.. చూసెల్లి పోతావు అంటూ దేవి కంపోజింగ్ లో వచ్చిన సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను మెప్పించింది. ఆ సాంగ్ టోన్ సినిమా సూపర్ హిట్ అనిపించేలా చేసింది. వర్షంలో త్రిష డ్యాన్స్, చిలిపితనం అన్ని ఈ పాటలో అద్భుతంగా కుదిరాయి. ఈ సాంగ్ లోనే హీరో, హీరోయిన్ కు పడిపోతాడు. 

 

నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా అంటూ త్రిష చేసే స్టెప్పులు అప్పట్లో ఎక్కడ డ్యాన్స్ షో జరిగినా ఈ పాత కచ్చితంగా ఉండాల్సిందే. దేవి శ్రీ ప్రసాద్ యంగ్ ఏజ్ లో మంచి కసితో మ్యూజిక్ ఇచ్చిన ఆల్బమ్స్ లో ఇది ఒకటి. అప్పటికి ఇప్పటికి వర్షం సినిమాలో ఈ సాంగ్ వస్తుంది అంటే అందరు ఆగి విని, చూసి వెళ్లాల్సిందే. ఇక త్రిష, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్ ను తమ ప్లే లిస్ట్ లో అలా ఫిక్స్ చేసుకుని ఉంచుకుంటారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది.     

 

మరింత సమాచారం తెలుసుకోండి: