కొన్ని కొన్ని పాటలు ఉంటాయి.. ఎంత బాగుంటాయి అంటే అందరూ ఆశ్చర్యపోయేంతగా ఉంటాయి. అంతేకాదు ఆ పాటతోనే కొందరు హీరోయిన్లు ప్రేక్షకులకు పరిచయం అవుతారు.. వావ్ ఈ హీరోయిన్ ఎంత బాగుంది అని అనుకునేలా ఆ పాటలో ఆ హీరోయిన్ ని చూపిస్తారు. అది చూస్తే నిజంగా ఎంత బాగుంది ఈ హీరోయిన్ అని అనుకుంటారు. ఇంకా శైలజ శైలజ అనే పాటతో అయితే కీర్తి సురేష్ అందరి గుండెల్లో నిలిచిపోయింది అంటే నమ్మండి. 

 

IHG's New Year gift

 

నిజానికి.. కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతోనే ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అయితే అనుకోకుండానే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇంకేముంది.. అందరూ హీరోయిన్ సూపర్ ఉంది అని అన్నారు. కానీ ఆమెకు నటన వచ్చి ఉంటే ఆ హీరోయిన్ ఇంకా అందంగా ఉండేది అంటూ కామెంట్లు చేసారు. ఇంకా నేను శైలజ సాంగ్ తో కీర్తి సురేష్ ని పడేశాడు రామ్. 

 

IHG

 

ఇంకా ఈ సినిమా తర్వాత ఆమె తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది. నాని తో నేను లోకల్, రెమో వంటి సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి. అయితే ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా మాత్రం మహానటి. ఈ మహానటి సినిమా చూస్తే ఎవరైనా సరే సావిత్రి అని ఫీల్ అవుతారు. మనం సావిత్రిని మైండ్ లో పెట్టుకొని సినిమా చూస్తే వచ్చే టైంకి సావిత్రిలా ఉన్న కీర్తి సురేష్ మన మైండ్లో ఉండిపోతుంది. సావిత్రి అని తలుచుకుంటే సావిత్రి కనిపించదు.. కీర్తి సురేష్ ఏ మన మైండ్ లో కనిపిస్తుంది. అంతటి గొప్పగా నటించింది కీర్తి సురేష్. 

మరింత సమాచారం తెలుసుకోండి: