ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా దక్షిణాది సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రకాష్ రాజ్ ఇప్పటి వరకు ఎవరు చెప్పని ఎక్కడా వినని ఒక ప్రాణం ఉన్న కథలో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు మహారణ్యంలో ఉండే జంతు జీవాల గురించి ఎన్నో సినిమాలు వచ్చినా కర్ణాటక లోని దట్టమైన అరణ్యాలలో స్వేచ్చగా తిరిగే జంతు జీవాల పై ప్రముఖ డిస్నీ ఛానల్ ‘వైల్డ్ కర్ణాటక’ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది.


ఈ కార్యక్రమం డిస్నీ ఛానల్ లో జూన్ 5న ప్రసారం కాబోతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించి తెలుగు తమిళ కన్నడ భాషలలో ప్రకాష్ రాజ్ వాయస్ ఓవర్ ఇచ్చాడు. ప్రకృతికి వాయస్ ఓవర్ ఇవ్వడం అనేది ఒక అర్ధవంతమైన ప్రయాణం అని చెపుతూ ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు చేయని ఈ సాహసం తాను చేసినందుకు తనకు ఎంతో గర్వంగా ఉంది అని అంటున్నాడు.


వాస్తవానికి ప్రకృతిని గౌరవించినప్పుడే అది మనిషి పై ప్రేమ చూపించి మానవ మనుగడకు సహకరిస్తుందని అయితే ప్రస్తుతం మనిష ప్రకృతిని పట్టించుకోని స్థితికి చేరి పోవడంతో ప్రకృతి మానవుడి పై పగపట్టి కరోనా లాంటి సమస్యలు సృష్టించి ప్రకృతి మానవుడి పై తీర్చుకుంటోంది అంటూ ప్రకాష్ రాజ్ అభిప్రాయ పడుతున్నాడు. కరోనా సమస్య ప్రారంభం అయిన తరువాత తన ఫౌండేషన్ సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రస్తుతం తన వద్ద పెద్దగా డబ్బు లేకపోతే కొంతమంది దగ్గర డబ్బు అప్పు తీసుకని తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అంటూ ఈ మధ్య ప్రకాష్ రాజ్ ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే.

స్వతహాగా మంచి భావకుడు అయిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఏకంగా ప్రకృతికి తన వాయస్ ఓవర్ ను ఇచ్చి తన వైవిధ్యాన్ని చాటుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: