టాలీవుడ్ ‌లో సుధీర్ఘ కాలంగా హీరోయిన్ ‌గా వెలుగొందుతున్న అందాల భామ శ్రియ. నటనతో పాటు గ్లామర్‌ షోలోనూ ఏ మాత్రం మోహమాట పడని ఈ బ్యూటీ అద్భుతమైన నడుమొంపులతో ఆకట్టుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ కెరీర్ ‌లో ఎన్నో రోమాంటిక్‌ సాంగ్స్‌ లో అలరించింది. అయితే వాటన్నింటిలోనూ ఎప్పటికీ గుర్తుండి పోయే పాట సుభాష్ చంద్రబోస్ సినిమా లోని నేరేడు పళ్లు పాట. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ‌లో తెరకెక్కిన ఈ పాట అప్పట్లో ఓ రేంజ్ ‌లో సెన్సేషన్ సృష్టించింది.

తడి అందాలతో శ్రియ నడుమొంపులు చూసేందుకు రెండు కళ్లు చాలవు. అందుకే సుభాష్ చంద్రబోస్‌ సినిమా ఫ్లాప్‌ అయినా ఆ పాట మాత్రం అలాగే నిలిచిపోయింది. మణిశర్మ సంగీత సారధ్యం లో సుద్దాల అశోక్ తేజ్ సాహిత్యమందించిన ఈ పాటను హరిహరన్‌, మహాలక్ష్మీ ఐయ్యర్ ‌లు అద్భుతంగా ఆలపించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్‌ కావటంతో ఆ పాటకు రావాల్సినంత పేరు రాలేదు.

ఇక సినిమా విషయానికి వస్తే.. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. ఒక పాత్రలో సుభాష్ చంద్రబోస్‌ కాలం నాటి విప్లవ వీరుడిగా కనిపించగా మరో పాత్రలో ఈ జనరేషన్‌ జర్నలిస్ట్ గా కనిపించాడు. ఈ రెండు పాత్రలో వెంకీ నటన అద్భుతమనిపించినా.. కథా కథనాలు ఆసక్తికరంగా లేకపోవటం, అప్పట్లో ఆడియన్స్ ఉన్న మూడ్‌ కు పెద్దగా కనెక్ట్ కాకపోవటంతో సినిమా ఫ్లాప్‌ అయ్యింది. ఈ సినిమాలో జెనిలియా మరో హీరోయిన్‌గా నటించగా ప్రకాస్‌ రాజ్‌ విలన్‌గా నటించాడు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సీ అశ్వనీదత్‌ నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: