భారతీయ చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ చిత్రాల్లో బాహుబలి ఒకటి. రాజమౌళి తెరకెక్కించిన ఈ వెండితెర దృశ్యకావ్యం ప్రపంచ దేశాల ప్రేక్షకులని అలరించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకి పరిచయం చేసిన బాహుబలి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక సినిమా గురించి సినిమా రిలీజ్ అయినపుడో, లేదా రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్నప్పుడో మాట్లాడుకుంటుంటారు.

 

 

 

కానీ బాహుబలి సినిమా రిలీజై ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇంకా మాట్లాడుకుంటున్నామంటే అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కి, అన్ని భాషల్లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. అందుకే బాహుబలి సినిమా ఎప్పటికీ ప్రత్యేకమే. రాజమౌళి విజన్, ప్రభాస్ కష్టం, ప్రొడ్యూసర్ల నమ్మకం బాహుబలిని మరో స్థాయికి తీసుకెళ్లాయి.

 

 

 

మొన్నటికి మొన్న రష్యా టెలివిజన్ లో రష్యన్ వాయిస్ ఓవర్ తో ప్రసారమైన బాహుబలి, ప్రస్తుతం హిందీ ప్రేక్షకులని అలరించింది. సోనీ మ్యాక్స్ ద్వారా ప్రసారమైన బాహుబలి చిత్రానికి 70 లక్షలకి పైగా ఇంప్రెషన్స్ దక్కడం విశేషం. సాధారణంగా కొత్తగా రిలీజైన చిత్రాలు టీవీలో వస్తుంటే వచ్చే ఇంప్రెషన్స్, ఐదేళ్ల క్రితం రిలీజైన బాహుబలికి వచ్చాయంటే ఆ సినిమా హవా బాలీవుడ్ లో ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

 

 

ఇప్పటికీ టీఆర్పీ పరంగా సెకండ్ ప్లేస్ లో కొనసాగడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ విషయాన్ని బ్రాడ్ క్యాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా వారు వెల్లడించారు. హిందీలో అత్యధికంగా చూసిన టాప్ 5 సినిమాలలో ఇన్నేళ్ళైనా సరే బాహుబలి 1 నెంబర్ 2 స్థానంలో నిలవడం విశేషం. ఇక బాహుబలి2 క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: