యువ హీరోయిన్ సురభి పెళ్లంటూ చేసుకుంటే ప్రేమించే పెళ్లిచేసుకుంటా అని అంటుంది. బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, జెంటిల్ మెన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అమ్మడు ఒక్క క్షణం, ఓటర్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అల్లరి నరేష్ భీమవరం బుల్లోడు, శశి సినిమాల్లో నటిస్తున్న సురభి ప్రేమ, పెళ్లి విషయాల గురించి తన మనసులో మాట చెప్పింది. అంతేకాదు సినిమాల సంఖ్యా పెంచుకోవడం కన్నా ఎన్ని గొప్ప పాత్రల్లో నటించామన్నది తనకు ముఖ్యమని చెబుతుంది. 


పెళ్లి చేసుకుంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా.. లేక ప్రేమ పెళ్లా అంటే.. ప్రేమ మీద తనకు మంచి అభిప్రాయం ఉందని.. ప్రేమ చాలా గొప్పదని అంటుంది సురభి. అయితే ఇప్పటివరకు తాను ఒక్క ప్రేమలేఖ అందుకోలేదని చెబుతుంది అమ్మడు. కాలేజ్ డేస్ లో చాలామంది ప్రపోజ్ చేశారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాల మీద ఉంది. పెళ్లి టైం వచ్చినప్పుడు తప్పకుండా ప్రేమించే పెళ్లి చేసుకుంటా అంటుంది సురభి. తనని, కుటుంబాన్ని బాగా చూసుకునే అబ్బాయి కావాలని అంటున్న సురభి ఇప్పటివరకు తన మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడలేదని చెబుతుంది. అలాంటోడు దొరికితే తప్పకుండా ప్రేమించే పెళ్లాడుతానాని అంటుంది.  


ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు చేస్తున్న అమ్మడు కన్నడలో కూడా ఒక సినిమా చేస్తుంది. సరైన ఛాన్స్ రావాలె కానీ తన సత్తా ఏంటో చూపిస్తా అని అంటున్న సురభి రానున్న రోజుల్లో కెరియర్ లో సక్సెస్ లు అందుకోవాలని ఆశిద్దాం. అంతేకాదు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సురభికి ఏపిహెరాల్డ్.కామ్ టీం తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.                                 

మరింత సమాచారం తెలుసుకోండి: