టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ఆమెకు వచ్చిన అవకాశాలు గాని ఆమెను గుర్తించిన విధంగా మరొకరిని గుర్తించడం గాని ఈ మధ్య కాలంలో దాదాపుగా జరగలేదు అనేది వాస్తవం. ఆమెకు వచ్చిన అవకాశాలతో పోలిస్తే ఇతర హీరోయిన్ లకు వచ్చిన అవకాశాలు చాలా తక్కువ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి ప‌ల్ల‌వి అందం కంటే న‌ట‌న‌తోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించి వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక‌మైన స్థానం ఏర్ప‌రుచుకుంది.

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త ఏంటీ అంటే ఆమెకు బాగా యాటిట్యూడ్ పెరిగింది అనేది కొందరి మాట. ఆమె కొందరు హీరోలతో ప్రవర్తించే విధానం గాని ఆమె మాట్లాడే మాటలు గాని కొందరి వద్ద చాలా చికాకుగా ఉన్నాయి అని అంటున్నారు. ఆమెకు తమిళంలో , మలయాళం లో ఎక్కువగా అవకాశాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకు ఎక్కువ ఛాన్సులు వస్తే ఎవరికి ఇబ్బంది లేదు గాని సీనియర్ హీరోలకు గౌరవ౦ ఇవ్వడం లేదని టాక్. 

 

దీని మీద చాలా మంది హీరోలు బహిరంగంగానే తీవ్ర వ్యాఖ్యలు ఆమె మీద చేసిన సందర్భాలు ఉన్నాయ‌ట‌. ఈ విష‌యంలో టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్ లో పెద్ద చ‌ర్చ‌నీయాంశ మైంది. ఇటీవల ఒక స్టార్ హీరో ఆమెకు నేరుగానే వార్నింగ్ కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. నిజం ఎంత అనేది తెలియదు గాని ఆమె మాత్రం షూటింగ్ కి కూడా సరైన సమయానికి రావడం లేదని నిర్మాతలు ... దర్శకులు చాలా సార్లు అసహనం వ్యక్తం చేసారట.

మరింత సమాచారం తెలుసుకోండి: