యువకుడు సినిమాతో టాలీవుడ్ పరిచయమైన భామ భూమిక చావ్లా. ఆమె సినిమా కెరియర్ కూడా ఆ సినిమాతోనే మొదలైంది. ఆ తర్వాత తమిళ బద్రితో అక్కడ సూపర్ హిట్ కొట్టింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన ఖుషి సినిమా భూమికను యూత్ ఆడియెన్స్ కు బాగా దగ్గర చేసింది. స్నేహమంటే ఇదేరా, వాసు సినిమాలు చేసినా మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ తో ఒక్కడు సినిమాతో ప్రేక్షకులను మెప్పించింది భూమిక. ఆ సినిమాలో స్వప్న రెడ్డి పాత్రలో భూమిక నటన చాలా బాగుటుంది. మహేష్ కు మొదటి కమర్షియల్ సూపర్ హిట్ అందించిన ఒక్కడు సినిమాలో భూమిక కూడా ప్లస్ అని చెప్పొచ్చు. 

 

హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ ట్రెండ్ కొనసాగుతున్న ఆ టైం లో మణిశర్మ భూమిక కోసం కంపోజ్ చేసిన పాత నువ్వేమాయ చేసావో కానీ.. ఆ ట్యూన్, ఆ లిరిక్స్ ఎంత అందంగా ఉన్నాయో ఆ సాంగ్ లో భూమిక కూడా చాలా అందంగా ఉంటుంది. మణిశర్మ మార్క్ మెలోడీగా వచ్చిన ఆ సాంగ్ కు సూపర్ క్రేజ్ తెచ్చింది. ముఖ్యంగా భూమిక అప్పటి యూత్ ఆడియెన్స్ కు బాగా నచ్చేసేలా చేసిన సినిమా అది. తన క్యూట్ లుక్స్ తో ఆ సాంగ్ లో లంగా ఓణీ వేసుకుని భూమిక చేసే స్టెప్పులు భలే అనిపిస్తాయి. అచ్చమైన తెలుగు ఇంటి అమ్మాయిలా అనిపించే భూమిక ఒక్కడు సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. 

 

అయితే తర్వాత తర్వాత సినిమాల సెలక్షన్స్ లో పొరపాట్ల వల్ల కెరియర్ లో వెనుకపడ్డది. కొద్దిపాటి గ్యాప్ తో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న భూమిక లేటెస్ట్ గా తన హాట్ షోతో అందరిని సర్ ప్రయిజ్ చేస్తుంది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు కూడా చేయని గ్లామర్ షో ఇప్పుడు చేస్తా అని అంటుంది భూమిక. సరైన ఛాన్స్ వస్తే తాను ఇప్పటికైనా ప్రూవ్ చేసుకుంటా అంటుంది అమ్మడు. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: