ఆరు భాషలలో దాదాపు 90 సినిమాల్లో పైగా నటించి స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న ముమైత్ ఖాన్ తెలుగులోనే 40కి పైగా సినిమాల్లో నటించింది. చత్రపతి లో మన్నేల తింటివిరా, పోకిరి'లో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే, యోగి లో ఓరోరి యోగి ఐటమ్ సాంగ్ లలో తన అందచందాలను ఒలకబోస్తూ శృంగార భరితమైన నాట్యం చేస్తూ తెలుగు ప్రేక్షకులకు కన్నుల విందు చేసింది. నిజం చెప్పాలంటే పోకిరి'లో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే ఐటమ్ సాంగ్ తో తనకి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాలో కూడా బంగారు కోడిపెట్ట పాటలో ముమైత్ ఖాన్ కనిపించి అందర్నీ ఫిదా చేసేసింది. 2004 నుండి 2016 వరకు ఆమె తిరుగులేని ఐటమ్ గర్ల్ గా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగింది. ఆపరేషన్ దుర్యోధన సినిమా లో శ్రీకాంత్ ఇతను తన అందాలను బీభత్సంగా చూపిస్తూ అందరికీ చమటలు పట్టించింది. మైసమ్మ ఐపిఎస్ చిత్రం లో పోలీసు పాత్ర లో ఒదిగిపోయి అందరిచేత వావ్ అనిపించింది.


ముమైత్ ఖాన్ తండ్రి పాకిస్తాన్ దేశానికి చెందినవాడు కాగా... తన తల్లి తమిళనాడు రాష్ట్రానికి చెందినది. ఈ దంపతులకు పెద్ద అమ్మాయి గా జన్మించిన ముమైత్ ఖాన్ ఆర్థిక సమస్యలతో కృంగి పోయేది. తినడానికి తిండి లేక చుట్టాలు ఎవరైనా వచ్చి ఏదైనా ఇస్తారా అని ఆశతో ఎదురు చూసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎవరూ తనని ఆదుకో పోయేసరికి ఆమె స్వయంగా డాన్స్ గ్రూప్ లో చేరి... కసితో డ్యాన్సులు చేసి పదిహేను వందల రూపాయలు సంపాదించింది. ఆ విధంగా డాన్స్ నేర్చుకున్న ముమైత్ ఖాన్ మెల్లిమెల్లిగా డాన్స్ షోలలో అవకాశాలు చేజిక్కించుకుంటూ తన అద్భుతమైన నాట్య ప్రతిభను అందరికీ చూపించి ఆశ్లేష మైన ఖ్యాతిని గడించింది. ఆ తర్వాత సినిమాల్లో అరంగేట్రం చేసి ఐటం సాంగులకు డాన్సులు చేయడం ద్వారా ఆమె తన ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టింది. హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ లో హస్తం ఉందని ముమైత్ ఖాన్ పై కేసు నమోదయ్యింది. 


ఈమె బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా ఉన్నప్పుడు... తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆమెను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు తీసుకొచ్చి విచారణ జరిపింది. డ్రగ్స్ దందా నడిపే కాల్విన్ తో ముమైత్ ఖాన్ కు సంబంధాలు ఉన్నట్టు కూడా ఆరోపణలున్నాయి. ముమైత్ ఖాన్ గతంలో తన అపార్ట్మెంట్లో తన బెడ్ పై నుండి కింద పడగా... తన బ్రెయిన్ లోని రెండు నరాలు ఛిద్రమయ్యాయి. దాంతో ఆమె 15 రోజుల పాటు కోమాలోకి వెళ్లింది. ఆ తర్వాత వైద్యులు ఆమెను ఎటువంటి వ్యాయామం చేయకూడదు అని హెచ్చరించారు. చిన్నప్పుడు ఆకలి బాధలు, ఇప్పుడేమో డ్రగ్స్ కేసులు, అనారోగ్య సమస్యలు ఆమె జీవితంలో దుఃఖాన్ని నింపుతున్నాయని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: