మన తెలుగులో కొన్ని కొన్ని పాటలకు ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది. ఆ పాటలు ఎప్పుడు వచ్చినా సరే ప్రేక్షకులు ఏ మాత్రం కూడా మిస్ కాకుండా చూస్తూ ఉంటారు. కొన్ని కొన్ని పాటలను దర్శకులు తీసిన తీరు అందులో ఉండే డాన్స్ సహా కొన్ని ప్రత్యేకంగా చెప్పుకునే విధంగా ఉంటుంది. ఇక మన తెలుగులో ప్రత్యేకంగా చెప్పుకునే పాటలు కొన్ని ఉన్నాయి. శోభన్ బాబు శ్రీదేవి హీరో హీరోయిన్ లు గా వచ్చిన సినిమా దేవతలో ఉండే పాటలు అయితే సూపర్ హిట్ అయ్యాయి అని చెప్పవచ్చు. అందులో ప్రత్యేకంగా చెప్పుకునే పాట ఒకటి ఉంది. 

 

అది ఏంటీ అంటే... ఏల్లు వచ్చి గోదారమ్మ అనే పాటకు టాలీవుడ్ షేక్ అయింది. ఆ పాటలో బిందెలు ఆ పాట తీసిన విధానం అన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఆ పాట ఫేమస్ అయింది. ఆ పాటలో ఇప్పటికి కూడా కొన్ని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను అలా చూస్తు౦డిపోయే విధంగా చేస్తూ ఉంటాయి. పాటలో ఉన్న బిందెలు ఆ బిందెల్లో శ్రీదేవి అందాలు అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ప్రతీ సీన్ కూడా ఆ పాటలో ఒక సంచలనమే. ఇండియన్ సినిమాలో ఆ పాట ఒక సంచలనం అనే చెప్పుకోవచ్చు. 

 

ఇప్పటికి కూడా అది టీవీ లో వస్తే చూస్తే జనాలు కూడా ఉన్నారు.  ఇటీవల వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమాలో కూడా ఆ పాటను చిత్ర యూనిట్ పెట్టింది గాని ఆ స్థాయిలో లేదు ఏది మాత్రం పక్కాగా చెప్పవచ్చు. ఇక ఆ సినిమాలో ఈ పాట హైలెట్ అయింది. ఆ పాటకు పూజ హెగ్డే డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. మంచి పేరే వచ్చినా ఆ స్థాయిలో హిట్ అవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: