ప్రస్తుతం ఒకప్పటి ఎవర్గ్రీన్ పాటలను ఇప్పుడు మరోసారి యువ హీరోలు  తమ సినిమాల్లో  రీమేక్ చేస్తూ గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మెగా హీరోలు మంచి గుర్తింపు తెచ్చుకుని   ఎవర్గ్రీన్ పాటలుగా  ప్రేక్షకులను ఆకర్షించిన  పాటలను... తమ సినిమాల్లో పెడుతూ తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తున్నారు. ఇలా మొన్నటికి మొన్న గద్దల కొండ గణేష్ సినిమాలో ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో సంచలనం సృష్టించిన పాట అయిన ఎల్లువొచ్చి గోదారమ్మ పాటను  పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ పాటలో ఏకంగా ఒకప్పటి గెటప్ లోనే డాన్స్ చేయడం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. అయితే పూజా హెగ్డే కెరియర్లో ఈ పాట ఎంతో స్పెషల్ గా మారిపోయింది. తెలుగు ప్రేక్షకులకు పూజా హెగ్డేను మరింత దగ్గర చేసింది ఈ పాట. 

 


 అయితే పూజా హెగ్డే కు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు ఉంది అన్న విషయం తెలిసిందే. అక్కినేని హీరో నాగచైతన్య తో కలిసి ఒక లైలా కోసం సినిమాలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది పూజా హెగ్డే. ఇక ఆ తర్వాత వరుణ్ తేజ్ తో  ముకుంద సినిమాలో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ మొదట తాను నటించిన సినిమాలు అంతగా విజయం సాధించకపోవడంతో ఈ అమ్మడి క్రేజ్ మాత్రం పెరగలేదు. కానీ ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇక క్రమక్రమంగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం ఆ సినిమాలు ఘన  విజయం సాధిస్తుండడం తో పూజా హెగ్డే అంతకంతకూ పెరిగి పోయింది అని చెప్పాలి. 

 


 అయితే పూజా హెగ్డే ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో పాటల్లో  లో కూడా కనిపించినప్పటికీ... ఇలా  పూజ హెగ్డే  కెరీర్లో ఒక స్పెషల్ సాంగ్ గా మారిపోయింది గద్దల కొండ గణేష్ సినిమాలోని ఎల్లువొచ్చి గోదారమ్మ పాట. ఈ పాటలో లంగా వోనీ లో నాటి తరం హీరోయిన్ల లాగా గెటప్ వేసుకున్న పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకులను తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ పాట పూజా హెగ్డే ఈ మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది అని చెప్పాలి. ఈ ఒక్క పాట స్టార్ హీరోయిన్ గా ఉన్న పూజాహెగ్డే కి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: