టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకు చాలా తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఏ స్టార్ హీరో వారసుడికి కూడా రాని విధంగా బాబుకి మంచి క్రేజ్ వచ్చింది. పెళ్లిచూపులు - గీతగోవిందం - అర్జున్ రెడ్డి లాంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో విజయ్ ఒక్కసారిగా స్టార్ హీరోలకే పోటీ ఇచ్చాడు. అయితే విజయ్ మాత్రం దాన్ని నిలబెట్టుకునే విషయంలో నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ మధ్య కాలంలో అతని నుంచి ఒక్కటి అంటే ఒక్కటి కూడా మంచి సినిమా రాలేదు.
వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత విజయ్ క్రేజ్ చాలా డౌన్ అయ్యింది. దీనికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని అతని నుంచి అయితే మంచి సినిమా రాకపోవడం తో అతని అభిమానులు కూడా కాస్త నిరాశతో ఉన్నారు. ఇప్పుడు అతను పూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ సినిమాలో అతను ఒక బాక్సర్ గా నటిస్తున్నాడు.
అది పక్కన పెడితే అతను ఈ సినిమా విషయంలో కాస్త దూకుడుగా సొంత పెత్తనం చేస్తున్నాడు అనే అసహనం పూరిలో వ్యక్తమవుతుందట. కథను మార్చాలి అని రొమాంటిక్ సీన్ లు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడట. కొన్ని సన్నివేశాలు తాను చెప్పినట్టు మార్చాలని పూరిని ఇబ్బంది పెట్టడంతో .. ఇలా అయితే మనం ఊహించిన రిజల్ట్ కష్టం అని తాను వార్నింగ్ కూడా ఇచ్చాడు అని సమాచారం.