గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. నిజ జీవిత గాథల్ని తెరకెక్కించడానికి దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. బయోపిక్ లలో నటించడానికి హీరో హీరోయిన్లు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం చాలా బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు బయోపిక్ ల హవా కొనసాగుతూనే ఉంది.

 

తాజాగా ప్రముఖ వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవితం వెండితెర మీద ఆవిషృతం కాబోతుంది. కోన వెంకట్ నిర్మాణంతో కలిసి ఎమ్వీవీ సత్యనారాయణ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. భారత దేశం నుండి మొట్టమొదటి ఒలింపిక్ పతకం సాధించిన మహిళగా రికార్డు క్రియేట్ చేసిన కరణం మల్లీశ్వరి జీవితంలోని ఆసక్తికర సంఘటనలని తెర మీద చూడబోతున్నాం. అయితే కరణం మల్లీశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనేది సస్పెన్స్ గా మారింది.

IHG's biopic is a multi-lingual film - The Hindu

 

ఈ పాత్ర చాలా మంది హీరోయిన్లని సంప్రదించారట. అందులో నిత్యా మీనన్ కూడా ఉన్నారు. కానీ నిత్యామీనన్ ఈ బయోపిక్ లో నటించడానికి ఒప్పుకోలేదని సమాచారం. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించడానికి ఎవ్వరైనా ఉత్సాహం చూపిస్తుంటారు. అదీ గాక క్రీడా నేపథ్యంలో సాగే కథకి మంచి డిమాండ్ ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు.

IHG

 

అయినా నిత్యామీనన్ ఎందుకు చేయనందో సస్పెన్స్ గా మారింది. కరణం మల్లీశ్వరి పాత్ర నిత్యా మీనన్ కి సరిగ్గా సూట్ అవుతుంది. అలాంటి పాత్రని మిస్ చేసుకోవడానికి కారణం నిత్యాకి సినిమాల ఇంట్రెస్ట్ తగ్గిపోవడమే అని అంటున్నారు. గత కొన్ని రోజులుగా నిత్యా మీనన్ సినిమాలేవీ ఒప్పుకోవట్లేదు. సినిమాలని తగ్గించుకుంటూ వెళ్లడానికి కారణం ఇంట్రెస్ట్ తగ్గిపోవడమే అని అంటున్నారు. ఈ విషయమై నిత్యా పెదవి విప్పితే గానీ ఏమీ చెప్పలేం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: