2006వ సంవత్సరంలో ఫోటో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అంజలి అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోల్ లో జన్మించింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె చెన్నైకి మకాం మార్చింది. బి.ఎస్సీ మ్యాథ్స్ పూర్తి చేసిన ఆమె చెన్నైలో సాఫ్ట్ వేర్ కంపెనీలో కొంతకాలం పాటు పని చేసింది. క్రమక్రమంగా షార్ట్ ఫిలింలలో నటిస్తూ సినిమా ఛాన్సులు చేజిక్కించుకుంది అంజలి. 


జర్నీ సినిమాలో ఆమె నటనకు గాను ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఆ సినిమా తర్వాత తనకు ఎన్నో ఛాన్సులు వచ్చిపడ్డాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చీరకట్టు అందాలతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన అంజలి... వాన చినుకులు ఇట్టా తడిపితే పాటలో అద్భుతంగా నాట్యం చేసి అందరి మనసులను దోచేసింది. తదనంతరం బలుపు, గీతాంజలి సినిమాలలో నటించి తన పాపులారిటీ బాగా పెంచేసుకుంది. నిఖిల్ హీరోగా నటించిన శంకరాభరణం సినిమాలో కూడా అంజలి ఓ ప్రధాన పాత్రలో నటించింది. 


2016వ సంవత్సరంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు చిత్రం లో బ్లాక్ బాస్టర్ అనే ఐటం సాంగ్ లో ఫుల్ ఎనర్జిటిక్ గా డ్యాన్స్ వేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈ పాటలో అల్లు అర్జున్ కంటే ఎనర్జిటిక్ గా అంజలి డాన్స్ వేయటం అందరి ఆశ్చర్యానికి కారణం అయ్యింది. ఇటీవల ఆమె అనుష్క ప్రధాన పాత్రలో నటించిన అన్ని శబ్దం సినిమా లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఏది ఏమైనా ఎటువంటి అవకాశాలు వచ్చినా కాదనకుండా సినీ కెరియర్ లో ఎదగడానికి అంజలి బాగా ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: