టాలీవుడ్‌ మ్యాన్లీ హంక్‌ రానా దగ్గుబాటి హీరో పరిచయం అయిన తొలి సినిమా లీడర్‌. శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన ఈ పొలిటికల్ డ్రామా సినిమా  ఓ స్పెషల్ సాంగ్ ‌లో ఆడిపాడింది అప్పటి అందాల యాంకర్‌ ఉదయభాను. అంతకు ముందుకు కూడా పలు చిత్రాల్లో నటించిన ఉదయభాను, ఈ సినిమాలో నటించే సమయానికి దాదాపు ఫేడ్‌ అవుట్‌ అయ్యే పరిస్థితుల్లో ఉంది. కానీ లీడర్ సినిమాలోని రాజశేఖర పాటతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.

రొమాంటిక్‌ టోన్‌ సాగే ఈ పాటలో అద్భుతమైన స్టెప్స్ ‌తో ఇరగ దీసింది ఉదయభాను. హీరోతో సంబంధంలేని ఈ పాట అప్పట్లో సూపర్‌ హిట్ అయ్యింది, ఈ పాట తరువాత ఉదయభాను కెరీర్ తిరిగి ఊపందుకుంటుందని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. కానీ ఈ పాట మాత్రం ప్రజల గుండెల్లో గట్టి ముద్రే వేసింది. మిక్కీ జే మేయర్‌ స్వరాలంధించిన ఈ పాటకు వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందిచాడు. శ్వేత పండిట్ హస్కీ వాయిస్ ఈ పాటకు మరింత హైప్ తీసుకువచ్చింది.

ఇక కథ విషయానికి వస్తే అక్రమార్జన చేసి ఎంతో సంపాందించిన ఓ ముఖ్య మంత్రి ఆఖరి క్షణం లో తన ప్రజలకు ఏం చేయలేక పోయానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఆయన చనిపోయిన తరువాత అనుహ్య పరిణామాల మధ్య ముఖ్యమంత్రి అయిన కొడుకు తండ్రి చేసిన తప్పులను సరిదిద్ది ప్రజలకు మంచి చేయాలకుంటాడు. కానీ స్వపక్షం నుంచే ఆయనకు వ్యతిరేక రావటంతో ఆ రాజకీయ క్రీడ లో హీరో ఎలా గెలిచాడు. చివరకు తను అనుకున్న మంచి చేశాడా.. .? లేదా.. ? అన్నదే మిగతా కథ.

మరింత సమాచారం తెలుసుకోండి: