నవాజుద్దీన్ సిద్ధీకి మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా తమ్ముడిపై వరుసకు కూతురు అయ్యే యువతి ఫిర్యాదు చేసింది. జమీనా ఇటీవల ఢిల్లీ పోలీసులకి నవాజుద్దీన్ తమ్ముడిపై ఫిర్యాదు చేసింది. 9 ఏళ్ళ వయస్సులో చిన్నాన్న నన్ను లైంగికంగా వేధించాడు. అప్పుడు నాకు అవి అర్ధం కాలేదు. నేను పెద్దయ్యాక అసలు విషయం గ్రహించి ఎంతో సిగ్గుపడ్డానని.. ఆ తర్వాత  పెళ్లి తర్వాత కూడా వేధించాడు. అత్తింటి వారిపై కూడా తప్పులు కేసులు పెట్టి హింసించేవారు. ఈ విషయం పెద్దనాన్న(నవాజుద్దీన్‌)కి చెప్పగా..'అతను నీ చిన్నాన్న, అలా ఎప్పుడూ చేయడు' అన్నారని జమీనా ఆవేదన వ్యక్తం చేసింది.

IHG

ఈ విషయం కాస్త సోసల్ మీడియాలో టాం టాం అయ్యింది.  తనకు రెండేళ్ల వయసున్నప్పుడు అమ్మ, నాన్న విడిపోయారని... ఆ తర్వాత నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె తెలిపారు. తొమ్మిదేళ్ల వయసులో మా చిన్నాన్న తనను లైంగికంగా ఇబ్బంది పెట్టాడని చెప్పారు. ఎంతో హింసకు గురయ్యానని తెలిపారు.  తాజాగా ఈ వివాదంపై ఈ నేప‌థ్యంలో న‌వాజుద్దీన్ త‌మ్మ‌డు ష‌మాస్ సిద్ధిఖీ త‌న  సోషల్ మాద్యమం ద్వారా స్పందించాడు.  కొంద‌రు చ‌ట్టాన్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. రెండేళ్ళ క్రితం ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో న‌వాజుద్దీన్ సిద్ధిఖీ పేరు లేదు. కాని ఢిల్లీ పోలీసుల‌కి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కొత్త‌గా చేర్చారు.

IHG

ఈ అస‌త్య ప్ర‌చారాల‌ని  మీడియాలో ప్రచారం చేయడం వెనుక ఓ వ్యక్తి ఉంద‌నే విష‌యాన్ని స్పష్టంగా సూచిస్తుంది. సత్యం త్వరలో బయటపడుతుంది అని ష‌మాస్ పేర్కొన్నారు. అయితే జ‌మీనా తాజాగా ఢిల్లీ పోలీసుల‌కి  ఫిర్యాదు చేయడంపై పెద్ద వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తన సోదరుడి విషయంలో ఇలాంటి రూమర్లు నవాజుద్దీన్ సిద్దికి మరో తల నొప్పే అంటున్నారు నెటిజన్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: