మన తెలుగులో జనాలకు ఎన్టీఆర్ సినిమాల మీద ఉన్న పిచ్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్‌ సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు రోజు అర్ధ‌రాత్రి నుంచే ఎన్టీఆర్ అభిమానులు థియేట‌ర్ల వ‌ద్ద చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆ రోజు వాళ్ల‌కు సంక్రాంతి పండ‌గే అని చెప్పాలి. ఇక ఇప్పుడు అతను ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ బాగా కష్టపడుతున్నాడు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు నిర్మాతగా కూడా అతను బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. భార్గవ్ హరి అనే బ్యాన‌ర్ పేరుతో అతను సినిమాలను నిర్మించడానికి గానూ ఒక సంస్థను తీసుకుని రావాలి అని ప్రయత్నాలు చేస్తున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు అతను దానిని మరింత స్పీడ్ గా ముందుకు తీసుకుని వెళ్ళే ఆలోచన చేస్తున్నాడ‌ట‌. ఇప్పుడు తన కొడుకుల పేరు మీద స్థాపించే బ్యాన‌ర్ మీద‌ ఒక వెబ్‌ సీరీస్ ప్లాన్ చేస్తున్నాడ‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.

 

ఈ వెబ్ సీరీస్ లో అతను ఒక చిన్న పాత్రలో నటిస్తూ తన కొడుకులను ఎక్కువగా చూపించే ప్రయత్నం చేస్తాడు అని.... వాళ్ళ రోజు వారీ కార్యక్రమాలను అలాగే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక ఏం చేస్తారు వంటివి చూపించే ప్రయత్నం చేస్తాడ‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వ‌స్తున్నాయి. ఇక మ‌హేష్ బాబు కుమార్తె సితార... ద‌ర్శ‌కుడు వంశీ పైడిపల్లి కుమార్తె క‌లిసి ఇప్ప‌టికే యూ ట్యాబ్ ఛానెల్ ద్వారా చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ వెబ్ సీరిస్ స్టార్ట్ చేస్తే ఆయ‌న పిల్ల‌ల హంగామా చూడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: