మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్, ఉప్పెనతో హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. కరోనా లేకుంటే ఈసినిమా ఏప్రిల్ లోనే విడుదలకావాల్సి వుంది కానీ ఈ వైరస్ వల్ల విడుదల వాయిదాపడింది. ఇక ఈసినిమా ఎడిటింగ్ వర్క్ కూడా పూర్తయింది. టాప్ డైరెక్టర్ సుకుమార్ దగ్గరుండి మరి ఎడిటింగ్ చేయించాడట. మొత్తం 2గంటల 30నిమిషాల రన్ టైం ను ఫిక్స్ చేశారట. అంతేకాదు సినిమా అవుట్ ఫుట్ పట్ల సుకుమార్ హ్యాపీ గా వున్నాడట. ఈసినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సాన, సుకుమార్ శిష్యుడే దానికి తోడు సుకుమార్, ఉప్పెన నిర్మాణం లో భాగస్వామి గా కూడా  వ్యవహరిస్తున్నాడు. 
 
ఇక ఈచిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలవుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి కానీ మేకర్స్ మాత్రం థియేటర్లలో విడుదలచేయడానికి ఇష్టపడుతున్నారట. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈచిత్రం విడుదలకానుంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఆమె కు ఇదే మొదటి సినిమా కాగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకొని సినిమా పై అంచనాలను పెంచేశాయి. సుమారు 25కోట్ల బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
 
ఇక ఈసినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి ప్రయాత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా  విజయ్ సేతుపతిరీమేక్ రైట్స్ ను తీసుకున్నాడట. ఓ స్టార్ హీరో కొడుకు తో ఉప్పెన ను రీమేక్ చేసే పనిలో వున్నాడు విజయ్ సేతుపతి. 

మరింత సమాచారం తెలుసుకోండి: