దగ్గుబాటి రానా, మిహిక బజాజ్ వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరగడం లేదట. వారం రోజుల క్రితం వీరిద్దరికీ జరిగిన రోకా ఫంక్షన్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అసలు ఈ రోకా కార్యక్రమం అంటే పెళ్లికి ముందు కొన్ని ఈ ప్రాంతాల్లో, కొన్ని కులాలకు సంబంధించిన వారు నిర్వహించుకునే కార్యక్రమం.. ఇక ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు ఒక చోటికి చేరుకొని పెళ్లికి సూత్రప్రాయంగా ఓకే అనుకొని, కట్నకానుకలు లేకపోతే ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకుంటారు. ఇది రోకా కార్యక్రమం అంటే. ఈ కార్యక్రమాన్ని ఉత్తర భారత దేశంలో చాలా ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించుకుంటారు. ఇక మరికొందరు ఈ ఈ కార్యక్రమాన్ని నిశ్చితార్థం తరహాలో కానిచేస్తుంటారు. 

 

ఈ కార్యక్రమం సరే కానీ మరి వీరి కుటుంబాల్లో ఎంగేజ్మెంట్ కార్యక్రమం గురించి మాట్లాడితే... ఈ విషయంలో మాత్రం దగ్గుబాటి కుటుంబం, బజాజ్ కుటుంబ సంప్రదాయాన్ని ఫాలో అయిపోయింది అంతే. దీనికి కారణం ఎలాగో ఆ రోకా కార్యక్రమం జరిగిపోయింది కదా... మళ్లీ ఈ కరోనా కాలంలోపెద్ద ఎంగేజ్మెంట్ చేసి ఆ కార్యక్రమానికి సగం మందిని పిలిచి సగం మందిని పిలవకపోతే ఎందుకు తిప్పలు అనే ఉద్దేశంతో ఏకంగా లగ్నపత్రిక రాసుకోవడం మేలు అని వారు ఆలోచిస్తున్నారు. ఇక పోతే మన తెలుగు సంప్రదాయం ప్రకారం లగ్నపత్రిక రాసుకొనే వ్యవహారం తప్పనిసరి.


ప్రస్తుత రోజుల్లో ఇదే కార్యక్రమంలోనే ఎంగేజ్మెంట్ కూడా కానీ చేసేస్తున్నారు కొందరు. అయితే లగ్నపత్రిక రాశేఖర్ దాని ప్రకారం కార్డులు అచ్చువేసి పంపిణీ చేయడం స్టార్ట్ చేస్తానని దగ్గుబాటి కుటుంబం చేయబోతోంది. ఇకపోతే ఈ కార్యక్రమం కూడా ఈనెల 15వ తారీఖున మొన్న జరిగిన కార్యక్రమంలో కేవలం వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరుగుతుందని తెలుస్తోంది. ఇకపోతే అందరికీ తెలిసినట్లుగానే ఆగస్టు 8 రాత్రి 8 :42 గంటలకు వీరి వివాహం. లాక్ డౌన్ కారణంగా ఎక్కువ మందిని పిలవకుండా కేవలం 50 మంది మాత్రమే అతిథులను ఈ కార్యక్రమానికి పిలుస్తున్నారు. అది ఎలా అంటే నిన్న మొన్న జరిగిన దిల్ రాజ్, హీరో నిఖిల్ వివాహ కార్యక్రమం లాగే... కేవలం 50 మంది తోనే ఈ వివాహ తంతు కూడా ముగించేయాలని ప్రాథమిక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: