యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు నంద‌మూరి మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీపై గ‌త మూడు నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి షూటిం గ్ న‌డుస్తున్న‌ప్పుడు ఈ సినిమాలో మోక్ష‌జ్ఞ క‌నిపిస్తాడ‌ని.. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి త‌న‌యుడు వ‌షీష్టీ ఫుత్ర పులోమావిగా మోక్షు ఉంటాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే అప్ప‌ట్లో బాల‌య్య ఈ ప్ర‌చారాన్ని ఖండిచ‌నూ లేదు. శాత‌క‌ర్ణి రిలీజ్ అయ్యింది సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టింది.

 

ఆ త‌ర్వాత బాల‌య్య చాలా సినిమాలు చేసేశాడు. పైగా త‌న తండ్రి ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన మ‌హానాయ‌కుడు, క‌థానాయ‌కుడు సినిమాల్లో కూడా న‌టించాడు. ఆ సినిమాల్లో ఎంతో మంది మ‌హామ‌హులు ఉన్నా కూడా మోక్షు లేడు. ఇక కొద్ది రోజులుగా మ‌ళ్లీ మోక్షు వెండి తెరంగ్రేటం పై వార్త‌లు వస్తున్నాయి. మ‌నోడు డ్యాన్సులు.. ఫైట్ల‌లో శిక్ష‌ణ తీసుకునేందుకు అమెరికాలో ఉన్నాడ‌ని అన్నారు. తాజాగా త‌న త‌న‌యుడి వెండి తెరంగ్రేటంపై బాల‌య్య స్పందించాడు.

 

త‌న తాజా ఇంట‌ర్వ్యూలో బాల‌కృష్ణ త‌న త‌నయుడు యాక్టింగ్‌పై ఆస‌క్తి చూపుతున్నాడ‌ని చెప్పుకొచ్చాడు. దీంతో నంద‌మూరి ఫ్యాన్స్ మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఖాయ‌మ‌ని ఫిక్స్ అయ్యారు. తాజా స‌మాచారం ప్ర‌కారం మోక్ష‌జ్ఞ సినిమాకి సాయి మాధ‌వ్ బుర్రా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న‌ట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ప‌వ‌ర్ ఫుల్ క‌థాంశంతో ఈ సినిమా ఉంటుంద‌ట‌. అతి త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని అంటున్నారు. బాల‌య్య‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన వారాహి చల‌న చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి ఈ సినిమాను నిర్మించ‌నున్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: