ప్రభాస్ భారీ టార్గెట్స్ తో సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. మల్టీలింగ్వల్ మూవీస్ కు సైన్ చేస్తున్నాడు. అయితే భారీ లక్ష్యాలతో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నా.. ఫ్యాన్స్ కు అప్ డేట్స్ ఇవ్వడంలో మాత్రం వెనుకబడిపోతున్నాడు. మిగతా హీరోలంతా దూకుడుగా ఉంటే.. డార్లింగ్ మాత్రం సైలెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేస్తున్నాడు. 

 

పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు లాంటి టాప్ హీరోలు, సినిమా అనౌన్స్ మెంట్ తో పాటే టైటిల్ లోగోలు, పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ కాకముందే ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారు. అయితే ప్రభాస్ మాత్రం రాధాకృష్ణ కుమార్ సినిమా టైటిల్ ను ఇంకా కన్ఫార్మ్ చేయలేదు. మూవీ టైటిల్ గురించి వస్తోన్న రూమర్స్ ని క్లియర్ చేయలేకపోతున్నాడు. 

 

పవన్ కళ్యాణ్ సెట్స్ లో అడుగుపెట్టిన చాలా తక్కువ టైమ్ లోనే.. వకీల్ సాబ్ టైటిల్ ను రివీల్ చేశాడు. ఇక మహేశ్ బాబు అయితే అనౌన్స్ మెంట్ తో పాటే సర్కారు వారి పాట టైటిల్ ను రిలీజ్ చేశాడు. ప్రీలుక్ పోస్టర్ తో అభిమానులను ఖుషీ చేశాడు. అల్లు అర్జున్ కూడా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కాకముందే పుష్ప టైటిల్ రిలీజ్ చేశాడు. రస్టిక్ లుక్ తో సర్ ప్రైజ్ చేశాడు. 

 

టైటిల్ తోనే సినిమా జనాల్లోకి వెళ్తుంది. ఆడియన్స్ కు టైటిల్ ఎంత బాగా కనెక్ట్ అయితే.. బజ్ అంత ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. కానీ ప్రభాస్ కు టైటిల్ వెతుక్కోవడమే పెద్ద సమస్యగా మారుతోంది. మల్టీలింగ్వల్ కు సెట్ అయ్యే టైటిల్ సెలక్ట్ చేసుకోవడానికి తంటాలు పడుతున్నాడు. 

 

సీనియర్ హీరోలు సెట్స్ కు వెళ్లిన కొన్ని రోజులకే  టైటిల్ లోగోలు రిలీజ్ చేస్తున్నారు. వెంకటేశ్ అయితే సెట్స్ కు వెళ్తూనే నారప్ప పోస్టర్స్ రిలీజ్ చేశాడు. జనాలను ఆశ్చర్యపరిచాడు. ఇక బాలకృష్ణ కూడా ఈ నెల 10న తన బర్త్ డే సందర్భంగా బోయపాటి సినిమా టైటిల్ ను రివీల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. 

 

సీనియర్ హీరోలు, యంగ్ స్టర్స్ అంతా చాలా ఫాస్ట్ గా టైటిల్ లోగోలు రిలీజ్ చేసి, ప్రమోషన్లు కూడా చేస్తోంటే.. ప్రభాస్ మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న రొమాంటిక్ స్టోరీకి ఏ టైటిల్ పెట్టాలా అని థింక్ చేస్తున్నారు. 

 

ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ సినిమాకు రెండు టైటిల్స్ వినిపిస్తున్నాయి. జాన్, రాధేశ్యామ్ అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మరి ప్రభాస్ ఈ రెండింటిలో ఒక్కటైనా సెలక్ట్ చేసుకున్నాడా.. లేక కొత్త టైటిల్ కోసం వెతుకుతున్నాడా అనేది తేలడం లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. సినిమా చేసేందుకు రెండేళ్లు తీసుకుంటున్నాడు అంటే ఓకే.. టైటిల్ కు కూడా ఇంత లేట్ చేస్తున్నాడేంటని డిస్కషన్లు పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: