15 రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ అదేనండి కేజిఎఫ్ సినిమా దర్శకుడు చేసిన ట్వీట్ దక్షిణాది సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. ఆయన తన సామాజిక మాధ్యమం ద్వారా " మీరు పక్కనుంటే న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర కూర్చున్న భావన కలుగుతుంది. త్వరలో నేను రేడియేషన్ సూట్ ధరించి మీ వద్దకు రాబోతున్న అని ప్రశాంత్ నీల్ " అని పేర్కొన్నాడు.

 

ఇక దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమాకు రంగం సిద్ధం అయింది అని వార్తలు ప్రచారంలోకి వెల్లువెత్తాయి. ఇకపోతే తాజాగా గురువారం నాడు ప్రశాంత్ నీల్ తన పుట్టిన రోజున జరుపుకున్నారు. 

 


ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ గొప్ప మనసు కలిగిన సంచలన దర్శకుడికి శుభాకాంక్షలు త్వరలో మిమ్మల్ని కలవ పోతున్నాం అని తన అధికారిక సోషల్ మీడియా ద్వారా తెలపడం జరిగింది. దీనితో ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమాకు అంత సిద్ధమైందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: