గత కొన్ని రోజులుగా నందమూరి బాలకృష్ణకు, మెగా ఫ్యామిలీ కి మాటల యుద్ధం కొనసాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీ పై పెత్తనం చెలాయించాలని కరోనా దేశంలో అడుగు పెట్టిన రోజు నుండి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్నడూ లేనిది తను ఇటీవల సోషల్ మీడియాలో రంగప్రవేశం చేసి వెనువెంటనే కరోనా క్రైసిస్ చారిటీ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. తెలుగు పరిశ్రమలో ప్రముఖులుగా కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ తన చారిటీ సంస్థకి విరాళాలు అందజేయాల్సిందిగా పిలుపునిచ్చాడు. వచ్చిన విరాళాలతో సినీ కార్మికులకు సహాయం ఎలా చేయాలో సినీ పెద్దలు అందరినీ పిలిచి భేటీ కూడా పెట్టాడు. 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా సినిమా చిత్రీకరణలను పునఃప్రారంభించేందుకు పర్మిషన్లు అడగడానికి కూడా తనే వెళ్ళాడు. కానీ ఈ విషయాలన్నిటిలో బాలకృష్ణ పేరు మాత్రం ఎప్పుడు ప్రస్తావించలేదు. ప్రముఖులతో భేటీ అయ్యేప్పుడు కూడా బాలకృష్ణ ని పిలవలేదు. దాంతో బాలయ్య బాబు కి బాగా కోపం వచ్చింది. ఆ కోపంలో తాను సినిమా ప్రముఖుల మీద మండిపడ్డాడు. తనకు బాగా టెంపర్ రావడంతో రెండు మూడు బూతు పదాలను కూడా నోరు జారాడు. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వేలు పెట్టే నాగబాబు బాలకృష్ణ వ్యాఖ్యలపై అందరూ ఊహించినట్టుగానే స్పందించాడు. నోరు అదుపులో పెట్టుకోవాలని, మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని నాగబాబు బాలకృష్ణ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. బాలకృష్ణ మాత్రం నాగబాబుని గడ్డిపరక ని తీసేసినట్టు తీసేసాడు. ఇవన్నీ చకచకా జరిగిపోతున్నా చిరంజీవి మాత్రం ఏ సందర్భంలోనూ బాలయ్య ని ఉద్దేశించి నోరు మెదపలేదు. కానీ తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం బాలయ్య బాబు ని పెద్ద ఇరకాటంలోకి నెట్టివేసేలా ఉంది. 


చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి బాగానే మద్దతు తెలుపుతున్నారు. అమరావతి తరలింపు కూడా చిరంజీవి మద్దతు తెలిపాడు. వారిద్దరి మధ్య ప్రస్తుతం ఎటువంటి విభేదాలు లేవు. అందుకే చిత్రీకరణ గురించి ఈ నెల 9వ తేదీన చర్చించాలని చిరంజీవి జగన్ ని కోరగా తాను వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చేశాడు. అయితే ఈసారి తనతో పాటు వచ్చే వారిని కొంతమందిని తగ్గించి బాలయ్య బాబు ను కూడా రమ్మంటున్నాడు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో బాలకృష్ణ ని చిరంజీవి తప్పకుండా పిలవాల్సిందే. కానీ బాలకృష్ణ వెళితే తను మందలో ఒకరిగా వెళ్లి ఓ అనామకుడు నిల్చోవడం ఖాయం. అలా ఓ అనామకుడిగా నిల్చోవడం బాలకృష్ణ కు అస్సలు ఇష్టం ఉండదు. నిజం చెప్పాలంటే కెసిఆర్ కు బాలకృష్ణకు మంచి సంబంధాలే ఉన్నాయి. 

 

కెసిఆర్ తో భేటీ కి బాలకృష్ణ వెళ్ళినట్లయితే... కెసిఆర్ తనని ఆప్యాయంగా పలకరించి మాట్లాడేవారు. కానీ జగన్ కి బాలకృష్ణ కి అస్సలు పడదు. వారిరువురు అసలు సిసలైన ప్రత్యర్థులు. అతని ఇంటికి వెళ్లి ఓ అనామకుడు గా బాలకృష్ణ నిలబడతాడా అనేది ఓ పెద్ద క్యూస్షన్ మార్క్. భేటీకి వెళ్లినా తనకి ఇబ్బందికరంగా మారుతుంది. వెళ్లకపోతే చిరంజీవి తనదైన శైలిలో బాలకృష్ణ పై విరుచుకుపడతాడు. తనని పిలవలేదని ఇప్పటి వరకు పెద్ద రచ్చ సృష్టించాడు... ఇప్పుడు పిలిస్తేనేమో రావడం లేదు ఇది ఎక్కడి చోద్యం? సినిమా పరిశ్రమ గురించి మాట్లాడేందుకు సీఎం దగ్గరికి వెళ్తూ... పిలిచాను తాను రావడం లేదు మీరు చూస్తున్నారు కదా? తనకి విధేయత లేదని ఇక్కడే అర్థమవుతుంది అని తప్పకుండా విమర్శిస్తాడు. దీంతో భేటీ కి వెళ్ళినా వెళ్ళకపోయినా బాలకృష్ణ ఇరకాటంలో పడతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: