అతి త‌క్కువ స‌మ‌యంలోనే త‌న న‌ట‌న ప్ర‌తిభ‌తో బాలీవుడ్ బెస్ట్ యాక్ట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో, స‌హ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ.  అయితే కొద్దికాలంగా వ్య‌క్తిగ‌త జీవితంలో ఏర్ప‌డిన వివాదాల‌తో వార్త‌ల్లో వ్య‌క్తిగా మారారు. న‌వాజుద్దీన్‌పై ఆయన భార్య అలీయా సిద్ధిఖీ ప‌లు ఆరోప‌ణ‌లు చేసింది.  ఈమేర‌కు విడాకులు కూడా కోరుతూ కోర్టును ఆశ్రయించిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి న‌వాజుద్దీన్‌కు రెండో వివాహం ఇది. కుటుంబ స‌భ్యుల కార‌ణంగానే న‌వాజుద్దీన్‌కు దూరం అయిన‌ట్లు అలీయా సిద్ధిఖీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మొద‌టి భార్య కూడా అందుకే విడాకులు తీసుకుంద‌ని కొద్ది రోజుల క్రితం అలీయా సిద్దిఖీ ట్విట్ట‌ర్ ద్వారా ఆరోపించింది. 

అయితే త‌ప్పు ఒప్పులు..ధ‌ర్మ‌, అధ‌ర్మం త్వ‌ర‌లోనే బ‌య‌ట‌ప‌డుతాయ‌ని న‌వాజుద్దీన్ సిద్దిఖీ పేర్కొని వ‌దిలేశాడు. ఇదిలా ఉండ‌గా తాజాగా న‌వాజుద్దీన్ సిద్దిఖీ త‌మ్ముడు ష‌మాన్ సిద్దిఖీ కూడా వివాదాల్లో చిక్కుకున్నాడు. తనను లైంగికంగా వేదించాడంటూ కూతురు వరసయ్యే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విష‌యంపై  ష‌మాస్ సిద్ధిఖీ మాత్రం ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. ‘కొంద‌రు చ‌ట్టాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించాల‌ని  చూస్తున్నారు.కానీ నిజాన్ని క‌ప్పి పుచ్చ‌లేరు.  రెండేళ్ళ క్రితం ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో న‌వాజుద్దీన్ సిద్ధిఖీ పేరు లేదు. కాని ఢిల్లీ   పోలీసుల‌కి ఇచ్చిన ఫిర్యాదులో కొత్త‌గా చేర్చారు. 


ఈ అస‌త్య ప్ర‌చారాల‌ని మీడియాలో ప్రచారం చేయడం వెనుక ఓ వ్యక్తి ప్ర‌యేయం ఉంద‌ని త‌న‌కు అర్థ‌మ‌వుతోంద‌ని తెలిపారు. త్వరలో నిజాల‌న్ని బ‌య‌ట‌ప‌డుతాయ‌ని ష‌మాస్ ట్వీట్‌ చేశారు. ఇదే విష‌యంపైనా న‌వాజుద్దీన్‌ను వివ‌ర‌ణ ఇచ్చారు. ‘నా గురించి, నా కుటుంబం గురించి ఆందోళన పడుతున్నందుకు ధన్యవాదాలు. దీని గురించి నేను ఏం మాట్లాడదల్చుకోలేదు’ అ‍న్నారు. నిజాలు త్వ‌రలోనే బ‌య‌ట‌ప‌డుతాయంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండ‌గా  కేసు వాప‌స్ తీసుకోక‌పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందంటూ సిద్ధిఖీ కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని ఢిల్లీ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన మ‌హిళ  పేర్కొంది. సిద్ధిఖీ బంధువు ఒకరు తనకు ఫోన్‌ చేసి కేస్‌ వాపస్‌ తీసుకోవాలని.. లేకపోతే కుటుంబం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటారని బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని వాపోయింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: