ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా భూతాన్ని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ ప్రెసిడెంట్ కమల్ హాసన్ అన్నారు.  దేశంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా మహరాష్ట్ర, రాజస్థాన్ తర్వాత తమిళనాడు ఉన్నాయి. ముఖ్యంగా చెన్నైలో కరోనా విళయతాండవం చేస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న చెన్నై సిటీని తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కమల్ హాసన్ సిద్దమయ్యారు.  లాక్‌డౌన్ తర్వాత ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటకు వెళ్లినప్పుడు వారి హెల్త్ ఇష్యూస్‌ కు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం.. తద్వారా చెన్నైని కరోనా ఫ్రీ సేఫ్ జోన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కమల్ ఈ మూమెంట్ ముందుకు తీసుకెళ్తనున్నారు. 

 

ఈ ప్రోగ్రామ్‌లో కమల్ తనను తాను మొదటి మెంబర్‌‌గా నమోదు చేసుకున్నారు. కరోనా వారియర్స్ గా ప్రతి ఒక్కరూ కావాలాని.. అలా ఈ ప్రోగ్రామ్ ద్వారా తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తామని.. ఇది చాలా మంది కలలను సాకారం చేసిన చెన్నై సిటీని మళ్లీ మామూలు స్థితికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నట్లు విశ్వనటుడు తెలిపారు. ఇక మీ భాగస్వామ్యంతోపాటు ప్రజల సహకారంతో ఏ సమస్యకైనా సులువైన పరిష్కారాన్ని కనిపెట్టొచ్చు. ఇది అలాంటి ఆలోచనలను అమలులోకి తెస్తోంది. ప్రజా సమస్యలకు పరిష్కారాలను కనుగొనే స్వచ్ఛంద సేవకుల సైన్యాన్ని మేం సృష్టిస్తున్నాం’ అని విలేకరులతో నిర్వహించిన వర్చువల్ మీటింగ్‌లో కమల్ హాసన్ చెప్పారు. 

 

 

ఈ కష్టకాలంలో కరోనా బాధితుల పట్ల వివక్షత చూపించవొద్దని వారికి రక్షణగా నిలబడాలని కోరారు.   ఈ ఇనీషియేటివ్‌లో జాయిన్ అవ్వడానికి 25 నుంచి 30 మంది డాక్టర్స్‌ ఉత్సుకతతో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్జీవోలతోపాటు మరింత మంది లైక్ మైండెడ్ పర్సన్స్‌ ఈ ఉద్యమంలో చేరాలని కోరారు. వారికి అవసరమైన వైద్య సాయం, సేఫ్టీ ఎక్విప్‌మెంట్, శానిటైజర్స్, ఫుడ్, రేషన్ అందిస్తామన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో గుమిగూడే చోట శానిటైజర్ డిస్పెన్సర్స్‌ను, ప్రజలకు మాస్క్‌లను వాలంటీర్స్‌ పంపిణీ చేస్తారన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: