నాలుగైదు రోజులుగా హీరోయిన్ మీరోచోప్రాకు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్ గురించి తెలిసిందే. ట్విట్టర్ లో నెటిజన్ ప్రశ్నకు.. ‘ఎన్టీఆర్ గురించి నాకు తెలీదు’ అని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం నచ్చని కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఆమెపై అసభ్యకరమైన పదజాలంతో ట్విట్టర్ లో దూషించి, బెదిరించారు. దీంతో వారిపై ఆమె సైబర్ కేసు కూడా పెట్టింది. జాతీయస్థాయిలో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు కూడా విన్నివించుకుంది. దీనిపై ఆయన స్పందించారు.

 

 

‘నాపై లైంగిక దాడి చేస్తామని, యాసిడ్ అటాక్ చేస్తామని బెదిరించారు. నన్ను అసభ్య పదజాలంతో దూషించారు. ఈ రాష్ట్రంలో ఓ మహిళకు ఎదురైన బెదిరింపులు ఇవి. సైబర్ పోలీసులు కూడా దీనిపై ఎఫ్ఐఆర్ నమోదే చేశారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ కేసు దర్యాప్తు జరుగుతుందని నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ఆమె మంత్రి కేటీఆర్ కు, మాజీ ఎంపీ కవితను ట్యాగ్ చేస్తూ మెసేజ్ చేసింది. ఈ ట్వీట్ కు స్పందించిన కేటీఆర్ ‘మేడమ్.. మీ పిటిషన్ పై పూర్తి న్యాయపరమైన విచారణ జరిగేలా చూడాలని తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను కోరుతున్నాను’ అంటూ రిప్లై ఇచ్చారు.

 

 

తనకు వచ్చిన బెదిరింపుల మెసేజెస్ ను కూడా స్క్రీన్ షాట్స్ తీసి తన ట్వీట్ కు యాడ్ చేసింది. కేటీఆర్ ఇచ్చిన భరోసాతో మీరోచోప్రా పిటిషన్ కు బలం చేకూరినట్టైంది. వ్యక్తుల ఇష్టాఇష్టాలకు విలువ ఇవ్వకుండా ఇలా బెదిరించడం, దూషించడం ఎవరికైనా తగని పని. మీరాచోప్రా అంశం జాతీయ జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. నేషనల్ మీడియా కూడా మీరాచోప్రాకు న్యాయం జరగాలని వార్తలు ప్రసారం చేసింది. ఈ విషయం మరెంత దూరం వెళ్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: