తెలుగు సినిమా చాలా ఫ్యాషనేట్ గా ఉంటుంది. ఇక్కడ లావిష్ గా ఖర్చు పెడతారని అంతా అంటారు. రూపాయి పెట్టాల్సిన చోట పది రూపాయలు పెట్టి సినిమాను భారీతనంతో నింపేయడం మన నిర్మాతలకు చాలా ఇష్టం.

 

అందుకే హీరోలకు, హీరోయిన్లకు కూడా ఎక్కువ మొత్తంలోనే పారితోషికాలు ఇస్తారు. ఉత్తరాది నుంచి ఆఖరుకు విలన్లకు, సింగర్స్ ని, మ్యూజిక్ డైరెక్టర్లను తెచ్చిన ఘనత టాలీవుడ్ కి ఉంది. గొప్పగా సినిమాలు తీయాలంటే టాలీవుడ్ పేరే మొదట చెప్పుకోవాలి. ఇవన్నీ ఇలా ఉంటే టాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేయాలంటే చాలు హీరోయిన్లంతా క్యూ కట్టేస్తారు. బాలీవుడ్ నుంచే  కాదు, ఏ వుడ్ నుంచి అయినా దిగిపోతారు.

 

అలాంటి టాలీవుడ్ లక్ష్మీకళను కరోనా మహమ్మారి ఓ విధంగా గట్టిగా  దెబ్బ తీసింది. ఒక పక్క సినిమా హాళ్ళు మూతపడ్డాయి. సినిమాలు సగంలో ఆగిపోయాయి. పెట్టుబడి అంతా రీళ్లలో ఉండిపోయింది. డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలు లేవు. మళ్లీ బొమ్మ పడాలి, షూటింగులు జరగాలి.  ధియేటర్లు అన్నీ కూడా  కిటకిటలాడితేనే తప్ప బడా నిర్మాతలకు కాసులు కనిపించవు.

 

దీంతో ఎన్నో భారీ ప్రాజెక్టులను కూడా మన నిర్మాతలు ఇపుడు వెనక్కుపెడుతున్నారుట. ముందు అర్జంటుగా చేయాల్సిన  ప్రాజెక్టులకే ఓకే చెబుతున్నారు. ముందు సినీ పరిశ్రమ కాస్తా కుదుట పడిన తరువాతనే భారీ ప్రాజెక్టులు అంటున్నారుట. మొత్తానికి టాలీవుడ్ ఎలా ఉండేదాని ఇలా చేసేసింది పాడు కరోనా మహమ్మారి అని అంతా దిగాలు పడుతున్నారట. 

 

ఈ పరిస్థితి చూస్తూంటే పాన్ ఇండియా మూవీస్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు అసలు లేవని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారుట. ఎందుకంటే అది అతి పెద్ద రిస్క్. ఇప్పటికే నిండా మునిగిన ప్రొడూసర్స్ అంతటి సాహసానికి ఇప్పట్లో తెగించరన్న మాట గట్టిగా వినిపిస్తోంది చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: