తెలుగు యూత్ మొత్తం మాట్లాడుకునే ఏకైక పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు సెట్ చేసే వాడే హీరో అన్న పవన్ డైలాగు యువతకు బాగా కనెక్ట్ అవ్వడంతో అందరి అయన దూకుడుకు ఫిదా అయ్యారు.  పవన్ ఎం చేసిన కూడా యూత్ బ్రాండ్ ఐకాన్ అని చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు కూడా పవన్ ను ఫాలో అవుతారు.

 

 

విషయానికొస్తే.. పవన్ లాగే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో మరో వ్యక్తి కూడా ఉన్నారు అని అందరు అంటారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారుగా.. విజయ్ దేవరకొండ.. ఈ హీరో కూడా అంతే తన మాట తనదే. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో దూసుపోతున్న ఈ యువ హీరో పవన్ కళ్యాణ్ కు సీక్వెల్ అంటున్నారు. వీరిద్దరిరి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని మనం సపరేటుగా చెప్పాల్సిన పనిలేదు. 

 

 

పవన్ తెలుగు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సృష్టించాడు. ఇక అదే మాదిరిగా విజయ్ దేవరకొండ కూడా ట్రెండ్ ఉన్న హీరో. పవన్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ, విజయ్ కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. ముక్యంగా నైజాం ఏరియాలో. విజయ్ కూడా ఇప్పుడు నైజాం నే తన అడ్డాగా చేసుకున్నాడు మరియు యూత్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. పవన్ లాగే ఆడియో ఫంక్షన్స్ లో మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంటాడు.

 

 

ఇది ఇలా ఉండగా తమ్ముడు అంటే విజయ్ కి ఎంత ప్రాణమో మొన్న ఆమధ్య జరిగిన దొరసాని ఆడియో లాంచ్ లోనే అర్థమయింది. పవన్ కు కూడా అన్న చిరంజీవి అంటే ఎంతప్రాణమో అందరికి తెలుసు. చాలా సందర్భాల్లో అన్న మాటను తలచుకొని ఏడ్చిన సందర్భాలు లేకపోలేదు. విజయ్ దేవరకొండ కూడా తమ్ముళ్లను ప్రేమించడంలో, పవన్ లాగే ఆలోచిస్తుండటంతో పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్ కు కూడా బాగా దగ్గరయ్యాడు. అందుకే చాలా మంది పవన్ కు జిరాక్స్ అంటే విజయ్ అని అందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: