టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత మళ్ళీ అంతటి సక్సస్ ట్రాక్ ని మేయిన్‌టైన్ చేస్తున్న దర్శకుడు కొరటాల శివ. రైటర్ గా సక్సస్ ఫుల్ సినిమాలకి పనిచేసి దర్శకుడిగా మారిన కొరటాల ప్రభాస్ తో మిర్చి సినిమా తీశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. డైరెక్టర్ గా కొరటాల శివ తీసిన మొదటి సినిమానే ప్రభాస్ కి మంచి మాస్ హిట్ ని ఇచ్చింది. ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీ దృష్ఠినే కాదు మహేష్ బాబు ఎన్ టి ఆర్ లాంటి స్టార్ హీరోల దృష్ఠిని ఆకర్షించాడు. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో శ్రీమంతుడు, ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్, మహేష్ బాబు తో భరత్ అనే నేను తీసి బ్యాక్ టు బ్యాక్ హిట్ సాధించారు.

 

ఈ సక్సస్ ట్రాక్ చూసిన మెగాస్టార్ చిరంజీవి తన సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. నిజంగా ఇలాంటి అవకాశం టాలీవుడ్ లో చాలా తక్కువ మందికే వచ్చిందని చెప్పాలి.ఇక కొరటాల శివసినిమా కోసం ఇప్పటికే రెండేళ్ళు ఆగాల్సి వచ్చింది. వాస్తవంగా అయితే ఈ రెండేళ్ళలో స్టార్ హీరోలతో మళ్ళీ రెండు చేసుండేవారు. కానీ అక్కడ ఉంది మెగాస్టార్ కాబట్టి ఇవేవి పట్టించుకోలేదు. సైరా వంటి సూపర్ హిట్ తర్వాత చిరు కొరటాల సినిమా సెట్స్ మీదకి వచ్చింది. అయితే కొంత భాగం టాకీ పార్ట్ కంప్లీటవగానే కరోనా మహమ్మారి వచ్చి పడింది.

 

దీంతో ఇప్పుడు ఆచార్య సినిమా కి ఒక్కసారిగా అన్ని సమస్యలు చుట్టుముట్టాయి. ఇప్పుడున్న టాక్ ప్రకారం ఈ సినిమా 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నప్పటికి పరిస్థితులు బావుంటే ప్రభాస్, వెంకటేష్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు పోటీ పడే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ గనక ఈ విపత్కర పరిస్థితులు గనక ఇలాగే కొనసాగితే ఇక ఆచార్య సినిమా రిలీజ్ సమ్మర్ కే. అపుడేమో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో పాటు మహేష్ బాబు సర్కారు వారి పాట, సుకుమార్ అల్లు అర్జున్ ల పుష్ప ఉండబోతున్నాయని తెలుస్తుంది. దీంతో కొరటాల శివ కాస్త ఆచార్య సినిమా విషయంలో ఒత్తిడి కి గురౌతున్నాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: