దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'రౌద్రం రణం రుధిరం'. ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమతో పాటుగా మిగతా సినిమా పరిశ్రమ వాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడైతే రాజమౌళి చరణ్, తారక్ ల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి ఇటు చిత్ర పరిశ్రమ తో పాటు ప్రేక్షకులలోను ఊహకందని రీతిలో అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా రాం చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకునేలా చేశారు రాజమౌళి బృందం. 

 

ఇక సినిమాని జనాలలోకి తీసుకు వెళ్ళడంలో రాజమౌళి స్ట్రాటజీ ఎలా ఉంటో అందరికీ తెలిసిందే. మొదటి నుంచి తన సినిమాను ప్రమోట్ చేయడంలో .. ప్రేక్షకుల్లో క్రేజ్ ని క్రియోట్ చేయడం లో రాజమౌళి స్ట్రాటజీనే వేరు. కరోనా సమస్య ఉన్నప్పటికి అదేమి పట్టించుకోకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' అంటూ ఎన్టీఆర్ ఒక స్పెషల్ వీడియోని విడుదల చేసినప్పుడే ఆయన ఎలాంటి మైండ్ సెట్ తో వర్క్ చేస్తారో అర్థమవుతుంది. దాంతో ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడన్న ఆసక్తి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు యావత్ ప్రేక్షకులకి బాగా పెరిగిపోయింది. 

 

ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి బర్త్ డే గిఫ్టుగా రామ్ చరణ్ కూడా 'రామరాజు ఫర్ భీమ్' అన్న ఒక స్పెషల్ వీడియో రెడీ చేయిస్తున్నాడని అందరూ ఆశ పడ్డారు. ముఖ్యంగా తారక్ ఫ్యాన్స్ లో నెలకొన్న క్యూరియాసిటి పీక్స్ లో ఉండింది. 'రౌద్రం రణం రుధిరం' లో తారక్ ఎవరూ ఊహించని రేంజ్ లో కనిపిస్తాడని ఫ్యాన్స్ తెగ చర్చించుకున్నారు. చరణ్ వీడియో కంటే ఇంకా ఎఫెక్టివ్ గా ఈ వీడియోలో కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ తో పాటు సీన్స్ ని రివీల్ చేస్తారని అనుకున్నారు.

 

కాని రాజమౌళి ఇచ్చిన షాక్ మాములూగ లేదు. ఒకరు కాదు యావత్ దేశ సిని అభిమానుల ఆశలు నీరుగారి పోయాయి. అయితే ఆ రోజు గనక తారక్ టీజర్ రిలీజ్ చేసి ఉంటే ఇదే తెలుగు ప్రేక్షకులు తారక్ అభిమానులు చాలా ఫీలయ్యోవారట. ఎందుకంటే రాజమౌళి అనుకున్నంతగా టీజర్ రాలేదని అయినా ఫ్యాన్స్ ఫీలవుతారని గనక రిలీజ్ చేసి ఉంటే ఇది ఆర్.ఆర్.ఆర్ కే పెద్ద మైనస్ అయి ఉండేదని తెలుస్తుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: