బాలక్రిష్ణ వెండితెర కధానాయకుడు. ఆయన సినిమాలు కోస్తా, నైజాం కంటే కూడా ఎక్కువగా రాయలసీమ జిల్లాలోనే  ఆడాయి. బాలయ్య సైతం రాయలసీమ ఫ్రాక్షన్, యాక్షన్ కధలతో టాప్ రేంజి హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. ఎన్టీయార్ కాలం నుంచి రాయలసీమలో నందమూరి వంశానికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 

ఇదిలా ఉండగా జగన్ కూడా ఒకపుడు బాలయ్య ఫ్యాన్ అని ప్రచారంలో ఉంది. ఇపుడు జగన్ ఏపీకి సీఎం. కానీ జగన్ని బాలయ్య ఒక్కసారి కూడా కలవలేదు. అదే సమయంలో సీనీ ఫీల్డ్ లో మెగాస్టార్ చిరంజీవి మాత్రం జగన్ తో మంచి సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారు.  ఇప్పటికి పలుమార్లు ఇద్దరూ భేటీలు వేశారు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి దంపతులను తన ఇంటికే పిలిచి విందు కూడా ఇచ్చారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే ఆంధ్రాలో తెలుగు సినిమా అభివ్రుధ్ధి కోసం చర్చలు జరిపేందుకు టాలీవుడ్ సినీ పెద్దల కమిటీ జగన్ని ఈ నెల 9న కలవబోతోంది. ఈ కమిటీలో కచ్చితంగా నాగార్జున ఉంటారని సమాచారం. ఎందుకంటే నాగార్జున జగన్ కి బాగా సన్నిహితుడు. అదే సమయంలో చిరంజీవి కూడా లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు. వివిధ విభాగాలకు చెందిన వారు కూడా ఉంటున్నారు.

 

ఈ మధ్యనే బాలక్రిష్ణ కూడా తనను పిలవడంలేదంటూ అలిగారు కాబట్టి బాలయ్యని పిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరి బాలయ్య ఈ కమిటీతో కలసి జగన్ని కలిస్తే అది చాలా ఇంటెరెస్టింగ్ న్యూస్ గా  ఉంటుందని అంటున్నారు. బాలయ్యతో నిజానికి జగన్ కి వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన్ని సాదరంగా రిసీవ్ చేసుకుంటారు కూడా.

 

జగన్ సీనియర్ ఎన్టీయార్ అంటేనే చాలా అభిమానం చూపిస్తారు. ఇక బాలయ్య విషయంలోనూ అదే తీరులో ఉంటారని అంటారు. పైగా బాలయ్య అంటే ఆయన చిన్నతనంలో అభిమాని అని అంటున్నారు కాబట్టి వైసీపీ వైపు నుంచి బాలయ్యకు మంచి ఆహ్వానమే ఉంటుంది. అదే సమయంలో బాలయ్య జగన్ కలిస్తే అది రాజకీయంగా కూడా పెద్ద వార్త అవుతుంది.

 

ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో ఉప్పూ నిప్పులా చంద్రబాబు జగన్ ఉన్నారు. అలాంటిది ఆయన బావమరిదిగా బాలయ్య వెళ్తే సమీకరణల్లో తేడా వస్తాయని ఆలోచించవచ్చేమో. అయితే బాలయ్యే చెప్పినట్లుగా రాజకీయాలు వేరు సినిమా వేరు అన్నట్లుగా కలిస్తే మంచిదే.  మరి బాలయ్య కలుస్తారా. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: