తెలుగు సినిమాల్లో పాటలకు ఉండే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. హీరో డ్యాన్స్, హీరోయిన్ గ్లామర్ తో పాటకు అందం తీసుకొస్తారు. మన సినిమాల్లో వాన పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. హీరో హీరోయిన్లు ఇబ్బందులు పడినా ప్రేక్షకులను మెప్పిస్తారు. వాన పాటలకు మెగాస్టార్ చిరంజీవి తనదైన డ్యాన్సులతో, హావభావాలతో కొత్త అందం తీసుకొచ్చారు. చిరంజీవి చేసిన వాన పాటల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయే పాట 1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్ లోని ‘వానా వానా వెల్లువాయే..’ పాట. సినిమా ఎంత హిట్టయిందో ఈ పాట కూడా అదేస్థాయిలో ప్రేక్షకాదరణ పొందింది.

IHG

 

ఈ పాటలో చిరంజీవి-విజయశాంతి చేసిన డ్యాన్స్, హావభావాలు పాటకు కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. పాటకు వేసిన సెట్ నుంచి వారిద్దరి డ్రెస్ కాంబినేషన్ వరకూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. డ్యూయెట్స్ లో చిరంజీవి డ్యాన్సులు చేయడంతోపాటు అందమైన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంలో దిట్ట. ఈ పాటలో స్లో స్టెప్స్ కు.. చిరంజీవి హావభావాలకు చాలా పేరొచ్చింది. ఈ పాటను అభిమానులు, ప్రేక్షకులు అంతగా  ఎంజాయ్ చేసారంటే కారణం అవే. ప్రభుదేవా కొరియోగ్రఫీలో ఉన్న ఫ్రెష్ నెస్ ను చిరంజీవివిజయశాంతి తన డ్యాన్సుల్లో చూపించి పాటను ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిపారు.

IHG

 

నిజానికి ఈ పాట చిత్రీకరణకు ముందు చిరంజీవి ఈ పాట వద్దన్నారట. స్పీడ్ సినిమాకు స్లో సాంగ్ వద్దని అంటే దర్శకుడు విజయబాపినీడు బలవంతం మీద ఒప్పుకున్నారట. సినిమా విడుదలయ్యాక ఈ పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తెలుగు సినిమాల్లోని వర్షం పాటల్లో గ్యాంగ్ లీడర్ లోని ఈ పాట ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఈ పాట తర్వాత చిరంజీవి వర్షం పాటలకు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందీ పాట.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: