సినిమాల్లో వాన పాట ఉంటే ఆ కిక్కే వేరబ్బా.. స్టార్ సినిమాలో ఇది స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుంది. అయితే స్టార్స్ సాంగ్స్ మాత్రమే కాదు వాన పాట ఎవరిదైనా ఊపేయాల్సిందే.. అయితే ఒకే పాటని ఇద్దరు కమెడియన్లు.. ఒకే హీరోయిన్ తో చేస్తే.. అబ్బో ఆ థ్రిల్ వేరేలా ఉంటుంది కదా.. 1993లో వచ్చిన రాజేంద్ర ప్రసాద్ మాయలోడి సినిమాలో బాబు మోహన్, సౌందర్యలతో కలిసి ఓ వాన డ్యూయెట్ సాంగ్ కంపోజ్ చేశారు. ఆ సాంగ్ సూపర్ హిట్.. బాబు మోహన్ ఏంటి సౌందర్యంతో స్టెప్పులేంటి అని ముందు ఆశ్చర్యపోయిన ఆడియెన్స్ ఆ సాంగ్ ను సూపర్ హిట్ చేశారు. 


ఇక అదే పాట ఆ మరుసటి సంవత్సరంలోనే జగపతి బాబు హీరోగా వచ్చిన శుభలగ్నం సినిమాలో అలీతో చేయించారు. ఇక్కడ కూడా సౌందర్య స్పెషల్ ఎట్రాక్షన్ గా చేసింది. మాములుగా అయితే ఒక పాట ఒక సినిమాలో ఉంటే ఆ పాట ని యాజిటీజ్ గా వేరే సినిమాలో వాడటం కుదరదు. కానీ రెండు ఎస్వీ కృష్ణా రెడ్డి సినిమాలే కావడంతో అది పెద్ద మ్యాటర్ కాలేదు. చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో అంటూ పక్కన సౌందర్యంతో బాబు మోహన్, ఆలీ వేసిన స్టెప్పులు థియేటర్లో దద్దరిల్లిపోయాయని చెప్పొచ్చు. 


ఆ సాంగ్ తర్వాత కమెడియన్ సాంగ్స్ కు కొద్దిగా క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. వాన పాట గురించి మాట్లాడితే ఈ సూపర్ హిట్ సాంగ్ ప్రస్తావన తీసుకురాగా తప్పదు. చినుకు చినుకు అందెలతో అప్పటికి ఇప్పటికి సూపర్ హిట్ రైన్ సాంగ్ గా చెప్పుకోవచ్చు. తానో స్టార్ హీరోయిన్ అయినా కూడా కమెడియన్స్ తో డ్యూయెట్ చేయడానికి సౌందర్య ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పుకోవడం కూడా గొప్ప విషయమే. మొత్తానికి అలా ఆ సాంగ్ రైన్ సాంగ్స్ లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: