సినిమాలో ఎన్ని పాటలున్నా సరే ఒక్క రెయిన్ సాంగ్ ఉంటే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. మూడీగా ఉన్న ప్రేక్షకులను మస్త్ జబర్దస్త్ జోష్ లోకి దించేలా ఈ సాంగ్స్ ఉంటాయని చెప్పొచ్చు. అలాంటి రెయిన్ సాంగ్స్ టాలీవుడ్ లో ఎన్నో ఉన్నాయి. సూపర్ హిట్ రెయిన్ సాంగ్స్ ఆ సినిమాలకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయని చెప్పొచ్చు. ఇక వాటిల్లో విక్టరీ వెంకటేష్, నగ్మా మధ్య వచ్చే చిత్తాకార్తిలో చినుకుల చిటపట సాంగ్ అయితే అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. సరదా బుల్లోడు సినిమాలోని ఈ రెయిన్ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. 

 

నగ్మా తడిసిన అందాలతో పాటుగా కోటి మ్యూజిక్ కూడా కిక్కు ఎక్కించేలా ఉంది. ముఖ్యంగా ఈ సాంగ్ కు వేటూరి రాసిన రొమాంటిక్ ఘాటు మాటలు అబ్బో మాములుగా ఉండవు. కన్నెపువ్వే కెవ్వుమంటే.. కుర్ర ఈడే కస్సు మంటే అంటూ ఘాటైన పదజాలం వాడి ప్రేక్షకులను అలరించారు వేటూరి. సినిమాలో ఈ సాంగ్ అప్పటికి ఇప్పటికి హాట్ ఆడియెన్స్ కు హాట్ ఫెవరెట్ అని చెప్పొచ్చు. వెంకటేష్, నగ్మా రొమాన్స్ ఈ సాంగ్ కు హైలెట్ గా నిలిచాయి.

 

అంతేకాదు సాంగ్ మొత్తం రెయిన్ ఎఫెక్ట్ లో కలర్ ఫుల్ గా ఉంటుంది. రవిరాజా పినిశెట్టి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా 1996లో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. టాలీవుడ్ రెయిన్ సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే తప్పకుండా సరదా బుల్లోడు నుండి చిత్తకార్తెలో చినుకుల చిటపట సాంగ్ కూడా వస్తుందని చెప్పొచ్చు. వెంకటేష్, నగ్మా ఈ సాంగ్ లో దుమ్ముదులిపేశారు. అప్పట్లో నగ్మాసినిమా చేసినా సూపర్ హిట్ అయ్యేది. తెలుగులో హాట్ హీరోయిన్ సాధించిన ఈ అమ్మడు హీరోయిన్ గానే తెలుగు సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: