తెలుగు సినిమాల్లో బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచే వాన పాటలు ఓ రేంజ్‌ లో పాపులర్ అయ్యాయి. ముఖ్యం గా రొమాంటిక్‌ సిచ్యుయేషన్‌ లో వాన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. హీరోయిన్ అందాలు మరింతగా ఎలివేట్ చేసి చూపించడానికి దర్శకులు వాన పాటలను ఎంచుకుంటారు. అయితే అన్ని సందర్భాల్లో విరహ గీతాలు మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో విషాద గీతాలు కూడా వాన నేపథ్యంలో తెరకెక్కించారు.

 

అలాంటి ఓ సూపర్‌ హిట్ విషాద గీతమే గాలి వాన లో వాన నీటి లో. ఒకప్పటి స్టార్ హీరో శోభన్ బాబు హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వం లో తెరకెక్కిన స్వయంవరం సినిమా లోది ఈ పాట. ఓ విషాదకర సిచ్యుయేషన్‌ లో వచ్చే ఈ పాటకు గాలి వాన నేపథ్యం లో సాహిత్యం అందించాడు దర్శక రచయిత దాసరి నారాయణరావు. అందుకు తగ్గట్టుగా గాలి వాన లోనే పాటను చిత్రీకరించారు.

 

శోభన్‌ బాబు హోరు గాలి వాన లో పాట పాడుతుండగా సాగే ఈ పాటను లెజెండరీ సింగర్ ఏసుదాసు మరింత అద్భుతంగా ఆలపించాడు. అందుకే ఈ పాట అప్పటి ఇప్పటికే అలాగే నిలిచిపోయింది. అయితే ఎక్కువగా వాన పాట అంటే విరహ గీతాలే తెర మీదకు వస్తాయి కాబట్టి ఈ పాట వాన పాటల లిస్ట్ ‌లో స్థానం సంపాదించుకోలేకపోయింది. ఏది ఏమైన విరాహానికే కాదు విషాదానికి కూడా వాన నేపథ్యంలో సూపర్‌ హిట్ కాంబినేషన్‌ అని ప్రూవ్ చేశాడు దర్శక రత్న దాసరి నారాయణరావు. 1982లో రిలీజ్‌ అయిన ఈ సినిమాలో జయప్రద హీరోయిన్‌ గా నటించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: