ఈ జనరేషన్లో తెరకెక్కుతున్న సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ కాస్త హద్దులు దాటి చిత్రీకరిస్తున్నారు. లిప్ లాక్‌లు కామన్ అయిపోయాయి. బెడ్ రూమ్ సీన్స్‌కు హద్దే లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్‌లో రొమాన్స్‌ను తెర మీద చూపించటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇలాంటి వాటన్నింటి మీద ఆంక్షలు ఉన్న సమయంలో కూడా రొమాన్స్ పండించటం మామూలు విషయం కాదు. అలాంటి రేర్ ఫీట్‌ను ఎన్నో సినిమాల్లో చేసి చూపించారు మన మేకర్స్. ఏ మాత్రం హద్దులు దాటకుండానే అద్భుతమైన రొమాన్స్‌ను పండించారు.
అలాంటి ఓ క్రేజీ రొమాంటిక్ సాంగే ప్రేమ సాగరం సినిమాలోని నీలో నాలో మోహాలన్ని అంటూ సాగే పాటే. దర్శకుడు టీ రాజేందర్ గురించి నిన్నటి తరంతో పరిచయం ఉన్న సినీ ప్రేక్షకులకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ప్రజెంట్ టాలీవుడ్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్న శింబు తండ్రే టీ రాజేందర్. ఆయన తమిళ్లో తెరకెక్కించిన సినిమాలు తెలుగులోనూ సంచలనాలు సృష్టించాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సినిమా ప్రేమసాగరం. ఈ సినిమా తెలుగులో కూడా వంద రోజులకు పైగా ఆడిందంటేనే ఆ సినిమా రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.
అప్పట్లో యూత్ అంతా ప్రేమ సాగరం సినిమా అంటే పడి చచ్చేవారు. ఈ సినిమాలో కథ కథానాలతో పాటు హీరో హీరోయిన్ల రొమాన్స్ కూడా హైలెట్ అనే చెప్పాలి. అందులోనూ వాన పాటు వారి రొమాన్స్, కళ్లతోనే వాళ్లు పలికించిన భావాలు ఎవర్ గ్రీన్. అందుకే ఆ ఆపటు ఎవర్ గ్రీన్ రెయిన్ సాంగ్స్ లిస్ట్‌లోనూ స్థానం సంపాదించుకుంది. ఈ సినిమాటో టీ రాజేందర్, నలినీ, సరితలు కీలక పాత్రల్లో నటించారు.