నారా రోహిత్, శ్రీ విష్ణు హీరోలుగా తెరకెక్కిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ తాన్య హోపే. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ తరువాత నేను శైలజ, పటేల్‌ సర్, పేపర్ బాయ్‌ లాంటి సినిమాల్లో నటించింది.

 

అయితే తెలుగులో ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్‌ మాత్రమే వస్తుండటంతో కోలీవుడ్‌ మీద దృష్టి పెట్టింది. అదే సమయంలో కన్నడ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. ఇటీవల డిస్కో రాజా సినిమాతో మరోసారి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్‌ ఫోటో షూట్‌లను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ డ్యాన్స్‌ వీడియోను షేర్ చేసింది.

 

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ ఫిట్‌ నెస్‌ మీద దృష్టి పెట్టింది. అందులో భాగంగా డ్యాన్స్‌ చేస్తూ బాడీని ఫిట్‌గా మెయిన్‌టైన్ చేస్తోంది. ఇటీవల కోలీవుడ్‌ లో ధరల ప్రభు అనేసినిమాలో నటించిన ఈ బ్యూటీ సాండల్‌ వుడ్‌లో హోం మినిస్టర్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలతో పాటు టాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Joganiya

A post shared by tanya Hope (@hope.tanya) on

మరింత సమాచారం తెలుసుకోండి: