నవదీప్, పూనమ్ బజ్వా లీడ్ రోల్స్ లో కూచిపూడి వెంకట్ డైరెక్ట్ చేసిన సినిమా మొదటి సినిమా. 2005లో రిలీజైన ఈ సినిమాలో ఉరిమే మేఘం సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. స్వరాజ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ఈ సాంగ్ అప్పటికి ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తుంది. ముఖ్యంగా జెమిని మ్యూజిక్ లో ఎన్నోసార్లు ఈ సాంగ్ ప్లే అవడం జరిగింది. హీరో హీరోయిన్ డ్యూయెట్ గా వచ్చిన ఈ సాంగ్ మొత్తం రెయిన్ లోనే ఉంటుంది. రెయిన్ ఎఫెక్ట్ లో పూనమ్ బజ్వా కూడా చాలా బాగుటుంది. 


సినిమాలో పాటలన్ని ఎలా ఉన్నా ఒక్క సాంగ్ సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఆ సాంగ్ తోనే ప్రేక్షకులు సినిమా చూసేందుకు వచ్చేలా చేయాలి. మొదటి సినిమాలో కూడా అంతే ఉరిమే మేఘం సినిమా ప్రోమో చాలా ఇంప్రెస్ చేసింది. ఆ సాంగ్ చూసి సినిమా హిట్టు కొట్టడం పక్కా అనుకున్నారు. అయితే సినిమాలోని ఈ సాంగ్ హిట్టయినా సినిమా మాత్రం నిరాశపరిచింది. నవదీప్ అప్పటికి కేవలం 2,3 సినిమాలు తీసిన అనుభవం మాత్రమే ఉంది. ఇక పూనమ్ బజ్వా ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది. 


ఈ సినిమాలో అమ్మడి నటన చూసి తెలుగులో స్టార్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకున్నారు. కానీ మొదటి సినిమాలపైనే కెరియర్ లో మిగతా సినిమాలు సెలక్షన్స్ సరిగా లేకపోవడంతో అమ్మడు అలా కెరియర్ లో వెనుకపడ్డది. మొదటి సినిమా హిట్టయితే పూనమ్ బజ్వా రేంజ్ వేరేలా ఉండేదేమో.. ఈమధ్య చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ అలరిస్తున్న పూనమ్ బజ్వా మళ్ళీ కెరియర్ పుంజుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది. తెలుగులో ప్లాప్ అయినా తమిళంలో అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: