నాగార్జున కెరీర్ లో మంచి విజయం సాదించిన సినిమాల్లో ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా అల్లరి అల్లుడు. ఈ సినిమా అతని కెరీర్ లో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో అతని నటన తో పాటుగా హీరోయిన్ నటన కూడా చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ప్రతీ సన్నివేశం కూడా సినిమాలో సూపర్ హిట్ అయింది అని చెప్పవచ్చు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో నాగార్జున నటన అప్పటి యూత్ కి చాలా బాగా నచ్చింది అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత అతనితో ఫ్యామిలీ కథలు తీయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ఆసక్తి కూడా చూపించారు అని చెప్తూ ఉంటారు. 

 

ఆ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు చూసిన ఇతర హీరోలు కూడా చాలా బాగుంది అంటూ అప్పుడు సినిమా చూసి వచ్చి మీడియా ముందు కామెంట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగా హిట్ అయ్యాయి అని చెప్పవచ్చు. ప్రతీ పాటకు కూడా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. ఇక ఆ పాటలో హీరో హీరోయిన్ రోమాన్స్ కి కూడా మంచి స్పందన వచ్చింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా నాగార్జున డాన్స్ కొన్ని కొన్ని పాటల్లో చాలా బాగా చేసాడు. 

 

ఆ సినిమాలో వాన పాటకు మంచి స్పందన వచ్చింది. కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగావే, చమ్మని బదులిమ్మని జత కమ్మని పిలిచావే అనే పాట చాలా బాగా హిట్ అయింది. ఈ పాటలో నగ్మా అందాలు లిరిక్స్ అన్ని కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. సినిమా విజయంలో ఈ పాటకు కొంత పాత్ర ఉంది అని చెప్తూ ఉంటారు సినీ జనాలు. ఆ విధంగా హిట్ అయింది ఆ పాట.

మరింత సమాచారం తెలుసుకోండి: