చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి వాన జాణ ఆడింది వయ్యారంగా నీళ్ళ పూలు జల్లింది సింగారంగా అనే వాన పాట హాస్యనటుడు బాబు మోహన్, అగ్రతార సౌందర్య కోసం రూపొందించారు. ఈ పాట రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన మాయలోడు(1993) సినిమా లో మొట్టమొదటిగా వినిపించగా... దీనిని ఎస్వీ కృష్ణారెడ్డి స్వరపరిచాడు. 

IHG
ఈ పాటను జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రాయగా... ఎస్పి బాలు, చిత్ర ఆలపించారు. అయితే 1994వ సంవత్సరంలో విడుదలైన శుభలగ్నం సినిమాలో కూడా ఇదే వాన పాట సౌందర్య తో, హాస్యనటుడు అలీ తో స్వరపరిచారు. ఎంతో క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్ సౌందర్య హాస్యనటుల తో జత కట్టి చిందేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ వాన పాటలో సౌందర్య దేవకన్యలా కనిపించి వెండితెరకు అందర్నీ కట్టిపడేసింది. 

IHG
ఎస్వీ కృష్ణారెడ్డి మొదటి రెండు చిత్రాలలో సౌందర్య రాజేంద్రప్రసాద్ నటించడం గమనార్హం కాగా... ఈ రెండు చిత్రాలను తన మిత్రుడు కే. అచ్చిరెడ్డి నిర్మించాడు. రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన మాయలోడు కుటుంబసమేతంగా అందరూ చూడదగిన చిత్రం. అప్పట్లో చాలా కేంద్రాల్లో విడుదల అయ్యి 100 రోజులు 175 రోజులు ఆడి కమెడియన్ రాజేంద్ర ప్రసాద్ కి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బాలిక కూడా ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు లభించింది. 

IHG
జగపతిబాబు ఆమని రోజా ప్రధాన పాత్రలో నటించిన శుభలగ్నం సినిమాలో కూడా ఇదే పాటను పొందుపరచి కమెడియన్ ఆలీ సౌందర్య లతో ఎస్వీ కృష్ణారెడ్డి స్వరపరిచాడు. రెండవసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఎవర్ గ్రీన్ పాట ప్రేక్షకులను ఏమాత్రం నిరాశ పరచలేదు. ఏది ఏమైనా సౌందర్య ఇద్దరు హాస్యనటుల పక్కన డాన్స్ చేసి తన మంచితనాన్ని చాటుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: