గజిని ఫేమ్ సూర్య తమ్ముడు అయిన హీరో కార్తి మిల్కీ బ్యూటీ తమన్నాతో కలిసి ఆవారా సినిమా లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ చిత్రం తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కాగా... రెండు రాష్ట్రాల్లో సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. తమన్నా ఈ చిత్రంలో ఓ అమాయకమైన అమ్మాయి పాత్రలో చాలా అందంగా కనిపించింది. తన అందాలను కేవలం కళ్ళతోనే ఆస్వాదిస్తున్న ఓ యువకుడి పాత్రలో హీరో కార్తి నటించాడు. వీళ్లిద్దరి మధ్య ఆ సాగే సన్నివేశాలు చాలా ముచ్చటగా ఉంటాయి. లింగస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ లో రిలీజ్ అయిన జబ్ వీ మెట్ నుండి కాపీ కొట్టబడిందని ఆరోపణలు వచ్చాయి కానీ ఈ సినిమాసినిమా కాస్త భిన్నంగా ఉంటుంది. రెండు సినిమాల్లో కామన్ పాయింట్ హీరో హీరోయిన్లు రోడ్డుమీద ఉన్నప్పుడే లవ్ లో పడతారు.

IHG
ఇకపోతే ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ యువన్ శంకర్ రాజా సంగీతం అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో ఉన్న ఐదు పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. చిరు చిరు చిరు చినుకై, మందార పువ్వల్లె, చుట్టేసై చుట్టేసై ప్రేమని, నీ ఎదలో నాకు చోటు వద్దు, అరెరే వాన జడివాన పాటలు తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించాయి. ముఖ్యంగా నీ ఎదలో నాకు చోటు వద్దు ఈ పాట అప్పట్లో తెలుగు పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టించింది. యూట్యూబ్ రికార్డులను తిరగరాసింది. అరెరే వాన జడివాన పాటలో తమన్నా తెల్ల బట్టలు తన అందచందాలను ఒలకపోస్తూ యువతకు మత్తెక్కించింది. ఈ మధురమైన మెలోడీ సాంగ్ ని వెన్నెలకంటి రాయగా... రాహుల్ నంబియార్ సైంధవి ఆలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: