స్వచ్ఛమైన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన సెవెన్ జి బృందావన కాలనీ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. రవికృష్ణ, సోనియా అగర్వాల్, సుమన్ శెట్టి చంద్రమోహన్ తారాగణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత బాణీలను సమకూర్చారు. ఏఎం రత్నం, శివ గణేష్ లిరిక్స్ అందించారు. ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ సెవెన్ జి బృందావన కాలనీ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లై దర్శకత్వం సెల్వరాఘవన్ అందించాడు. తెలుగులో మాత్రం శ్రీ రాఘవన్ దర్శకత్వం వహించాడు. 


2004 అక్టోబర్ 15వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఫస్టాఫ్ యువతని బాగా ఎంటర్టైన్ చేయగా... సెకండాఫ్ మాత్రం అందరినీ బాగా ఏడిపించేసింది. సినిమాని థియేటర్లో ఫస్ట్ షో చూసిన వారి అనుభూతి మాటల్లో వర్ణించలేనంతగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆవారాగాడు పాత్రలో రవికృష్ణ అద్భుతంగా నటిస్తే... విద్యార్థిని (పంజాబీ అమ్మాయి) పాత్రలో సోనియా అగర్వాల్ సూపర్ గా నటించింది. ఆమె మొహం లో పలికిన హావభావాల కి తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులయ్యారు. రవి పై కోపం, ప్రేమ ఆప్యాయత, అసహ్యం చాలా సహజంగా చూపించిన సోనియా అగర్వాల్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

 

ఇకపోతే ఈ సినిమాలో అన్ని పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. తలచి తలచి చూసా, ఇది రణరంగమా, కలలు కనే కాలాలు, కన్నుల బాసలు తెలియవులే ఈ నాలుగు పాటలు తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చేశాయి. ఏ సినిమాలో ఓ పొరపాటు కారణంగా అనిత చేత బాగా అవమానించ బడిన తర్వాత రవి ఇంటికే పరిమితం అవుతాడు. తనని తన స్నేహితుడు సుమన్ శెట్టి అతడిని బయటికి తీసుకు రాగా ఆ సందర్భంలో కన్నుల భాషలు తెలియవులే పాట ప్లే అవుతుంది. 


ఈ పాట ఒక ప్రేమికుడి బాధను చాలా బాగా వివరిస్తుంది. ప్రముఖ సింగర్ కార్తీక్ ఈ పాటను అద్భుతంగా పాడి అందరి చేత ప్రశంసలను అందుకున్నాడు. పాట చివర్లో వర్షం కురుస్తున్న సన్నివేశంలో వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మనసును నేరుగా తాగుతుంది. ఇళయరాజా కుమారుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి తన సంగీతంతో ప్రాణం పోశాడు అని చెప్పుకోవచ్చు. తలచి తలచి చూస్తే అంటూ తన మధురమైన గొంతుతో పాట పాడిన శ్రేయ ఘోషల్ కి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: