సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన 'ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా' పాటను ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్ కలిసి ఆలపించగా... మణిశర్మ సంగీత బాణీలను అందించాడు. ఈ పాట ఇంద్ర సినిమా లోనిది కాగా... అప్పట్లో ఇది అందరికీ ఇష్టమైన పాటగా నిలిచింది. చిరంజీవి పెద్ద బొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని ఈ పాటలో ముచ్చటగా నాట్యం చేస్తూ వాన దేవుడు భూమి మీదకి దిగి తిరిగి రావాలని కొడతాడు. చివరికి రాయలసీమలో పెద్ద వర్షం కురుస్తుంది. దీంతో రాయలసీమ ప్రజలంతా ఆనందోత్సాహాలతో వర్షంలో తడుస్తూ నాట్యం చేస్తుంటారు. ఈ పాటకు సంగీత బాణీలను అందించిన మణిశర్మ, కొరియోగ్రఫీ చేసిన రాఘవ లారెన్స్ లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 


విశేషమేమిటంటే ఈ చిత్రంలోని పాటలకు కొరియోగ్రఫీ అందించిన రాఘవ లారెన్స్ కు బెస్ట్ కొరియోగ్రాఫర్ ఫిలిం ఫేర్ అవార్డు లభించింది. చిరంజీవి దాయి దాయి దామ్మా స్టెప్ వేయించిన రాఘవ లారెన్స్ అప్పట్లో బ్రహ్మరథం పట్టింది అంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే ఈ పాటకి తగ్గట్టుగా మణిశర్మ అద్భుతంగా సంగీత బాణీలను సమకూర్చారు అని చెప్పుకోవచ్చు. చిరంజీవి గొంతు నుండి వూడి పడ్డట్టు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అద్భుతంగా పాడాడు. ఇచ్చిన కొన్ని పదాలను అయినా మల్లికార్జున్ అద్భుతంగా పాడాడు. ఘల్లు ఘల్లుమని సిరిమువ్వలే చినుకే చేరగా పాట ఈ చిత్రంలో అన్ని పాటల కంటే గొప్పదేమీ కాదు కానీ ఇది కచ్చితంగా ఒక జెమ్ లాంటి సాంగ్ అని చెప్పుకోవచ్చు. 


2002 జూన్ 14వ తేదీన సాయంత్రం ఇంద్ర సినిమా ఆడియో ఫంక్షన్ కార్యక్రమాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ లోని మొదటి భవంతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంద్ర చిత్రం కోసం డైలాగులు రాసిన పరుచూరి బ్రదర్స్, నిర్మాత అశ్వనీదత్, చిన్ని కృష్ణ, సిరివెన్నెల సీతారామశాస్త్రి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమాన్ని యాంకర్ సుమ రఘు కుంచె ప్రారంభించారు. 18 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ పాటలు ఇప్పటికీ ఫ్రెష్ గానే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: