అక్కినేని నాగార్జున కెరీర్ లో వచ్చిన సినిమాల్లో ప్రత్యేకంగా ఉండే కొన్ని సన్నివేశాలు అప్పట్లో చాలా బాగా ఆకట్టుకునేవి ప్రేక్షకులను. ప్రతీ సన్నివేశం కూడా రోమాన్స్ లో నాగార్జున తర్వాతే ఎవరు అయినా అనే విధంగా ఉండేది అప్పట్లో. ఆ విధంగా రోమాన్స్ విషయంలో నాగ్ తన మార్క్ వేసుకున్నారు. మొదటి సినిమాలో అంతగా రోమాన్స్ లేకపోయినా సరే తర్వాతి సినిమాల్లో మాత్రం రోమాన్స్ కి నాగ్ చాలా ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్పవచ్చు. ఏ సన్నివేశం అయినా ఎలాంటి సందర్భం అయినా సరే నాగార్జున చాలా బాగా ఆకట్టుకున్నారు అని చెప్పవచ్చు. 

 

ఇక ఆయన కెరీర్ లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన సినిమా గీతాంజలి. ఆ సినిమాలో నాగార్జున నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. నాగార్జునతో పాటుగా హీరోయిన్ కూడా చాలా బాగా నటించారు ఈ సినిమాలో. ఇక ఈ సినిమాలో వర్షం సన్నివేశం గురించి చెప్పాలి అంటే... గీత నాగార్జున హెల్త్ కండీషన్ తెలుసుకోవాలి అని వస్తుంది. ఈ సందర్భంగా ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఆ పోస్టర్ చచ్చిపోతుంది ఈ పోస్ట్ మాస్టర్ కూడా చచ్చిపోతాడు అంటూ ఒక డైలాగ్ చెప్తాడు. దానికి మంచి స్పందన వచ్చింది. ఆ సీన్ లో వర్షం పడటం... పక్కన గొడుగు పడి ఉండటం అన్నీ కూడా ప్రేక్షకులకు ఇంకా గుర్తున్నాయి. 

 

ఆ సీన్ లో నాగార్జున నటన సీన్ కి హైలెట్ అని చెప్తారు. ఇక ఆ సినిమా అప్పట్లో మంచి వసూళ్లను కూడా సాధించింది. ఆ సినిమాలో నాగ్ నటన చూసిన విమర్శకులు అతనికి రోమాన్స్ కాదు నటన కూడా వచ్చు అని వ్యాఖ్యలు చేసారు. ప్రతీ సీన్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఆ సినిమా ఒక రేంజ్ లో హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: