సినిమాల లో స్టార్లు హీరోయిన్లు అందరూ పెద్ద హీరో ల సరసన నటిస్తున్నారు.అలా అయితేనే క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇప్పటి కీ ఆ తంతు జరుగుతూ వస్తోంది.. అలాంటి సంఘటనలు ఎన్నో ప్రేక్షకులను అలరించిన సినిమాలు కూడా ఉన్నాయి.. అయితే సౌందర్య లాంటి అందమైన హీరోయిన్ గురించి తెలియని వాళ్ళు ఉండరేమో అంతగా ఆమె శారీరకంగా దూరమైన మానసికంగా అందరి మదిలో గుర్తింపు తెచ్చుకున్నారు.. 

 

 

 

ఇక పోతే ఆమె తో సినిమాలు చేయాలని చాలా మంది అనుకుంటారు. అయితే సినిమా కథ ఎలా డిమాండ్ చేస్తే అలా సినిమాలలో నటించి మెప్పించారు.. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆమె చిన్న కమెడియన్ అయిన బాబు మోహన్ సరసన కూడా సినిమా చేసింది. ఆ సినిమా నే మాయలోడు.. ఆ సినిమాలో ని పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి.. అలాంటి ది అందు లోని అందరినీ కడుపుబ్బా నవ్వించిన సాంగ్ చినుకు చినుకు అందెలతో .. వానలో సాగిన ఈ పాట సౌందర్య తో సమానం గా బాబు మోహన్ స్టెప్పు లేయడం హైలెట్ గా నిలిచింది..

 

 

 

సినిమా హిట్ అవ్వాలంటే కథ ఎంత ముఖ్యమో అంతకు మించిన రేంజులో పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అప్పుడే సినిమా సూపర్ హిట్ అవుతుంది..సంగీత ప్రియులు ఎక్కువగా పాటలను ఆస్వాదిస్తూ సినిమాలకు మంచి క్రేజ్ ను తీసుకొస్తున్నారు..అయితే ఐటమ్ సాంగ్స్ కన్న కూడా  వర్షం లో వచ్చిన సాంగ్స్ ప్రేక్షకులను ఎక్కువగా అకర్షిస్తున్నయి.. ఎది ఏమైనా కూడా వానలో వచ్చిన సాంగ్స్ ప్రేక్షకులను అలరించడమే కాదు సినిమాను సూపర్ హిట్ అయ్యేలా చేస్తాయి..ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను అలరించాయి. సౌందర్య లాంటి అందగత్తె మళ్లీ పుట్టాలని అందరూ కోరుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: