రామ్ చరణ్ ,బోయపాటి శ్రీను ,దానయ్య కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం వినయ విధేయ రామ. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈచిత్రం ఏ స్థాయిలో పరాజయాన్ని చవిచూసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా డిజాస్టర్ క్రెడిట్ అంతా బోయపాటి  ఖాతాలోనే పడింది దాంతో అటు రామ్ చరణ్ ఫ్యాన్స్  కూడా బోయపాటిని విపరీతంగా ట్రోల్ చేశారు. నిర్మాత దానయ్యకు అయితే  ఈచిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. మూడో రోజు నుండే థియేటర్లలు ఖాళీ గా కనిపించాయి మరి అలాంటింది ఈసినిమా టీవి లో వస్తే ఎవరు చూస్తారు అనే అనుమానం కలుగడం సహాజం కానీ లో టీవి ప్రసారమైన ప్రతిసారివినయ విధేయ రామ మినిమం రేటింగ్స్ ను రాబట్టుకుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుంది.
 
ఇప్పటివరకు ఈ చిత్రాన్ని ఎనిమిది సార్లు ప్రసారం చేయగా ప్రతి సారి పర్వాలేదనే రేటింగ్స్ ను రాబట్టుకుంది. మొదటి సారి ఈచిత్రం 7. 9 టీఆర్పీని రాబట్టగా ఆ తరువాత వరుసగా 8.2, 8.16,7.2, 8.18,5.19,6.35 రేటింగ్స్ ను రాబట్టుకుంది. ఇక గత వారం 7.97 టీఆర్పీని రాబట్టి ఆ వారం లో అత్యధిక రేటింగ్ ను సాధించిన చిత్రంగా సత్తా చాటింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
 
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. పాన్ ఇండియా బిగెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తుండగా రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడు. కరోనా వల్ల షూటింగ్ ఆగిపోగా జులై నుండి తిరిగి షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నారు. వివిఆర్ తరువాత బోయపాటి శ్రీను తన లక్కీ హీరో బాలకృష్ణ తో సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ కూడా ప్రారంభం కాగా ప్రస్తుతం కరోనా వల్ల బ్రేక్ పడింది. బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా రానున్న ఈ చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ పెట్టనున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: