టాలీవుడ్ లో శీను వాసంత లక్ష్మీ సినిమా గురించి పెద్దగా జనాలకు పరిచయం లేదు గాని ఈ సినిమా మాత్రం ఒక సంచలనం. ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాలో గుడ్డి వాడిగా నటించిన విధానం అన్నీ కూడా హైలెట్ గా నిలిచాయి అని చెప్పవచ్చు. ఆయన ప్రతీ సీన్ లో కూడా గుడ్డి వాడిగా చాలా బాగా నటించారు. ఆ సినిమాలో పాటల నుంచి కథ వరకు నటుల వరకు ఏది కూడా తక్కువ చేసి చూడలేని పరిస్థితి ఉంది అనేది వాస్తవం. ఆ సినిమా తర్వాత ఆర్పీ పట్నాయక్ కి గాయకుడిగా కూడా మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పవచ్చు. 

 

ఆయన ఆ సినిమాలో చాలా అందంగా నటించడమే కాదు ఆయన లేకపోతే అసలు ఆ సినిమానే లేదు అనే విధంగా నటించి మెప్పించారు అని చెప్పవచ్చు. అది అలా ఉంటే ఆ సినిమాలో ఉన్న ఒక వాన పాట చాలా బాగా ఆకట్టుకుంది. వాన వాన అంటూ వచ్చిన ఆ పాట  ఇప్పటికి కూడా ఎక్కడో ఒక చోట వినపడుతూనే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వాన పాటల్లో అది ఒక రేంజ్ లో హిట్ అయిన పాటగా చెప్పుకోవచ్చు. గొడుగుతో నడిచి వెళ్ళే సన్నివేశాలు  ఆ పాటలో హైలెట్ గా ఉంటాయి. వానను మనుషులు ఎంత ఇష్టపడతారో చెప్పే  పాట కూడా అది. 

 

ఆ పాటను దర్శకుడు తీసిన విధానం అన్నీ కూడా చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. ఇక అది అలా ఉంటే ఇప్పుడు పట్నాయక్ పెద్దగా కనపడటం లేదు. ఆయన సినిమాలు కూడా పెద్దగా రావడం లేదు అని చెప్పవచ్చు. ఇక ఆయన గాయకుడిగా మాత్రమే వినపడుతున్నారు గాని పెద్దగా తెర మీద కనపడటం లేదు. కన్నడ సినిమాల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: